• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీనువైట్ల.. మరో క్రేజీ...

శ్రీనువైట్ల.. మరో క్రేజీ కాంబో

| టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు వెలుగొందిన శ్రీను వైట్ల ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-01 09:37 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు వెలుగొందిన శ్రీను వైట్ల ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఢీ, రెడీ, దూకుడు.. ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కోన వెంకట్, గోపీ మోహన్ తో కలిసి అందించారు శ్రీను వైట్ల. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా వరకు వీరంతా కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. విడిపోయాక.. ఎవ్వరికీ సరైన హిట్లు పడలేదని చెప్పాలి!

అయితే శ్రీనువైట్ల.. చివరగా మాస్ మాహారాజా రవితేజతో 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేశారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. మ్యాచ్ స్టార్ గోపీ చంద్ విశ్వంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంతో గోపీచంద్ కూడా హిట్ కొట్టాలని బాగా ట్రై చేస్తున్నారు.

ఇక శ్రీనువైట్ల.. విశ్వం తర్వాత కొత్త సినిమా ఎవరితో చేయనున్నారోనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను శ్రీను వైట్ల కలిసినట్లు వార్త బయటకొచ్చింది. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల.. రామ్ కు కథ బేసిక్ పాయింట్ ను వినిపించారని తెలుస్తోంది. అయితే రామ్ ఆ పాయింట్ నచ్చి.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మన్నారని సమాచారం.

ప్రస్తుతం శ్రీను వైట్ల.. ఫుల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారట. త్వరలోనే రామ్ కు మొత్తం కథ నెరేట్ చేయనున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో టాక్ కూడా వినిపిస్తోంది. విశ్వం మూవీ రిజల్ట్ వచ్చిన తర్వాత రామ్.. శ్రీను వైట్ల కు ఓకే చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక రామ్.. త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, శ్రీను వైట్లకు రామ్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Tags:    
  • Srinivaitla 
  • Viswam 
  • Gopichand 
  • Rampothineni 
  • Tollywood 
  • Filmindustry 
  • Doubleismart 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS