శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ క్లాష్ పై క్లారిటీ వచ్చేసింది!

ఒకే హీరో నుంచి ఒకే వారం లేదా ఒకే రోజు రెండు సినిమాలు రావడం వల్ల థియేటర్ల పంపిణీ, షోల కేటాయింపులో చాలా ఇబ్బందులు ఉంటాయి.;

Update: 2026-02-19 05:44 GMT

టాలీవుడ్ హీరోలు ఒక్కోసారి వరుస సినిమాలతో బిజీగా ఉండటం మామూలే. కానీ ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో అలాంటి పరిస్థితి ఎదురైంది. అతను నటించిన మృత్యుంజయ్, విష్ణు విన్యాసం చిత్రాలు ఫిబ్రవరి 27న ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరిగింది. దీనిపై శ్రీవిష్ణు రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు.

ఈవెంట్‌లో అడిగిన ప్రశ్నలకు శ్రీవిష్ణు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. మీ స్టార్స్ అన్నీ బాగున్నాయా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం ఏంటి? అని అడిగిన ప్రశ్నకి ఆయన నవ్వుతూ బదులిచ్చారు. ఆ రెండు సినిమాలు ఒకే రోజు అయితే 100% రావడం లేదని కన్ఫర్మ్ చేశారు. ఈ విషయంలో రేపు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని చెబుతూ ఆ విషయంలో ఉన్న సస్పెన్స్‌కు తెరదించారు.

ఒకే హీరో నుంచి ఒకే వారం లేదా ఒకే రోజు రెండు సినిమాలు రావడం వల్ల థియేటర్ల పంపిణీ, షోల కేటాయింపులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పెను ప్రమాదం అయితే ఇప్పుడు తప్పిందని శ్రీవిష్ణు సంతోషం వ్యక్తం చేశారు. కనీసం ఒక వారం గ్యాప్ లో కూడా ఈ రెండు సినిమాలు రావని, ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్పారు. దీంతో శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు అంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది.

గతంలో నేచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి క్లాష్ ని ఫేస్ చేశారు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం, జెండా పై కపిరాజు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం మంచి హిట్ కొట్టి నాని కెరీర్ ని మలుపు తిప్పింది. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా అదే తరహాలో రిస్క్ తీసుకుంటున్నారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమాల మధ్య గ్యాప్ ఉంటుందని తెలియడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీవిష్ణు ఎప్పుడూ తన కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తుంటారు. మృత్యుంజయ్ సినిమా చాలా సీరియస్ గా, యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోంది. అదే సమయంలో విష్ణు విన్యాసం మాత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ఇలా రెండు భిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తుండటంతో ఆడియన్స్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. కంటెంట్ బాగుంటే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతాయని సినీ ప్రియులు నమ్ముతున్నారు. ఇక ఫిబ్రవరి చివరి వారంలో శ్రీవిష్ణు సందడి మామూలుగా ఉండదు. రిలీజ్ డేట్స్ పై వచ్చే అఫీషియల్ అప్‌డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రెండు సినిమాల్లోనూ తన నటనతో అలరించడానికి శ్రీవిష్ణు రెడీ అయిపోయారు. మరి ఈ డబుల్ ఎంటర్టైన్మెంట్ లో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టిగా సౌండ్ చేస్తుందో చూడాలి.



Tags:    

Similar News