నాగ చైతన్య సినిమాలో ఆస్కార్ నామినేటెడ్ నటుడు..

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఓ నటుడి గురించి రివీల్ చేసి అంచనలు పెంచారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.;

Update: 2025-08-28 07:04 GMT

అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో ఆయన రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజై మంచి విజయం అందుకుంది. ఇక చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ సినిమాను కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నారు.


కార్తిక్ గతంలో తీసినవిరూపాక్ష లాంటి సినిమాలు బ్లాస్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఎన్ సీ 24 ప్రాజెక్ట్ టైటిల్ తో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఓ నటుడి గురించి రివీల్ చేసి అంచనలు పెంచారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

లాపతా లేడీస్ సినిమాకు కీలకమైన స్పర్ష్ శ్రీవాస్తవ ఇప్పుడు చైతన్య NC24 సినిమాలో జాయిన్ అవుతున్నాడు. ఆయనకు ప్రాజెక్ట్ లోకి స్వాగతం అని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఆయనది నటనకు స్కోప్ ఉన్న అత్యంత ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. కాగా, స్పర్ష్.. ఆస్కార్ అవార్డ్స్ నామినేటెడ్ లాపతా లేడీస్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలో స్పర్ష్ నటనకు హిందీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలాంటి నటుడు తెలుగులో నాగచైతన్య సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.

అయితే తాపతా లేడీస్ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ కు దేశం నుంచి ఉత్తమ సినిమాగా ఎంపికైంది. కానీ, అవార్డ్ గెలుచుకోలేకపోయింది. ఇక ఈ సినిమా మైథలాజికల్ జానర్ గా తెరకెక్కనుంది. చైతన్య ఇప్పటివరకు లవ్ అండ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ డ్రామా జానర్ లలో నటించారు. తొలిసారి పూర్తి స్థాయి మైథాజికలక్ గా తెరకెక్కుతుండడంతో ఆసక్తి నెలకొంది.

అలాగే ఇది ఒక హై- కాన్సెప్ట్ చిత్రంగా రూపొందుతుంది. సినిమాలో హై క్వాలిటీ విజువల్స్‌ ఉంటాయని, అవి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ తో అంచనాలు పెరిగిపోయాయి. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర (SVCC) సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News