పొట్టి నిక్కర్లో హీట్ పుట్టిస్తున్న సోనాల్!
సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రావాలనే కోరికలో భాగంగా మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.;
సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రావాలనే కోరికలో భాగంగా మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలోనే కొనసాగితే.. మరికొంతమంది ఒకటి రెండు చిత్రాలకే దూరమవుతున్నారు. ఇంకొంతమంది తెలుగులో సినిమాలు చేసి ఇక్కడ మళ్ళీ అవకాశాలు లభించక.. పక్క భాష ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అలా అవకాశాలు వెతుక్కునే పనిలో మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకొని దర్శకనిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ తమ అందంతో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సెలబ్రిటీస్ వారు షేర్ చేసే ఫోటోలు అభిమానులను మరింత ఖుషీ చేస్తున్నాయని చెప్పాలి. కొంతమంది అందాలు ఆరబోస్తుంటే మరి కొంతమంది చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. పొట్టి నిక్కర్లో తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.
వైట్ టాప్ , డెనిమ్ షాట్ లో అందాలు ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ భిన్నమైన ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక అమ్మడి అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఇక సోనాల్ చౌహాన్ విషయానికి వస్తే.. మలేషియాలోని సారవాక్ రాష్ట్రంలోని మిరిలో 2005లో మిస్ వరల్డ్ టూరిజం కిరీటాన్ని సొంతం చేసుకుంది . ఈ కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా ఈమె కావడం గమనార్హం. ఆ తర్వాత ప్రముఖ కవర్ పేజీలపై కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక తొలిసారి హిమేష్ రేహమ్మియా తీసిన ఆప్ కా సురూర్ అనే చిత్రం ద్వారా వెండితెరకు తొలిసారి పరిచయమైంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ సరసన నటించిన ఈమె తొలిసారి తెలుగులో 2008లో ఇంద్రధనస్సు అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సమయంలో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా ఈమెకు మరింత పాపులారిటీ లభించింది.
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు లభించాయి. అలా పండగ చేస్కో, షేర్ , సైజ్ జీరో వంటి తెలుగు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే తెలుగులోనే కాదు తమిళ్ వంటి భాషా చిత్రాలలో కూడా నటించింది సోనాల్ చౌహాన్. ఇకపోతే ఒకవైపు తెలుగులో మరొకవైపు హిందీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె 2023లో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో మండోదరి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె అటు టెలివిజన్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఇలా గ్లామర్ ఫోటోలు పంచుకుంటోంది.