పొగ తాగ‌డం కోసం ల‌క్ష‌లు త‌గ‌లేస్తున్న స్టార్ హీరో!

దశాబ్దాల కాలంగా వెండితెరను ఏలుతున్న ఒక అగ్ర కథానాయకుడి విలాసవంతమైన జీవనశైలి, ఆయనకున్న విచిత్రమైన అలవాట్ల గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది.;

Update: 2026-03-14 13:30 GMT

దశాబ్దాల కాలంగా వెండితెరను ఏలుతున్న ఒక అగ్ర కథానాయకుడి విలాసవంతమైన జీవనశైలి, ఆయనకున్న విచిత్రమైన అలవాట్ల గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. సదరు హీరోకు ఉన్న `చైన్ స్మోకింగ్`అలవాటు ఎంతటిదంటే.. రోజుకు వంద సిగరెట్లు తాగనిదే ఆయనకు రోజు గడవదు. పని ఒత్తిడిని అధిగమించడానికి తాను పొగ తాగ‌డంపైనే ఆధారపడతానని ఆయనే స్వయంగా గతంలో అంగీకరించారు. అయితే ఈ వ్యసనం ఆయన వ్యక్తిగత ప్రయాణాలపై ఊహించని ప్రభావాన్ని చూపిస్తోంది.

సాధారణంగా కమర్షియల్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేటప్పుడు కఠినమైన నిబంధనలు ఉంటాయి. విమానం లోపల ధూమపానం చేయడం చట్టరీత్యా నేరం. గంటల తరబడి సాగే అంతర్జాతీయ ప్రయాణాల్లో సిగరెట్ లేకుండా ఉండటం ఆ స్టార్ హీరోకు దాదాపు అసాధ్యంగా మారింది. విమానాశ్రయాల్లో వేచి ఉండటం లేదా విమానంలో నిబంధనలకు లోబడి ప్రయాణించడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ చిక్కుల నుండి బయటపడటానికి ఆయన ఒక ఖరీదైన విరుగుడు కనిపెట్టారు.

విమానయాన సంస్థలతో గొడవలు ఎందుకు? అని భావించిన ఈ స్టార్ హీరో తన ప్రయాణాల కోసం సొంత జెట్‌ను ఆశ్రయిస్తున్నారు. తన సొంత జెట్‌లో ప్రయాణిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. అక్కడ తన ఇష్టానుసారం ధూమపానం చేయవచ్చు.. ఆల్కహాల్ సేవించవచ్చు. షూటింగ్‌లు, అవార్డు వేడుకలు లేదా అత్యవసర పనుల కోసం ఎక్కడికి వెళ్లాలన్నా ఆయన తన ప్రైవేట్ జెట్‌నే వాడుతున్నారు. గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తే... ఆ స్వేచ్ఛ కోసమే ఆయన ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

వినడానికి ఇది విడ్డూరంగా అనిపించినా లగ్జరీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడిన ఆ స్టార్ హీరో తన వ్యసనం కోసం ఏకంగా లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణం అంటే అయ్యే ఖర్చు సామాన్యులకు అందనంత ఉంటుంది. కేవలం సిగరెట్ తాగాలనే కోరిక తీర్చుకోవడం కోసం ప్రయాణాలకు అంత భారీ మొత్తాన్ని తగలేయడం అనేది గ్లామర్ ప్రపంచంలో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇదంతా చూస్తుంటే `అనుభవించు రాజా!` అనే క్లాసిక్ సాంగ్ ఈయన కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.11,000 కోట్ల నికర ఆస్తులు ఉన్న ఈ స్టార్ హీరోకు.. ప్రయాణాల కోసం లక్షలు ఖర్చు చేయడం అనేది చాలా తేలికైన లైట్ తీస్కునే ప‌ని. ఆయన ఖర్చు చేస్తున్న దానికి డబుల్, ట్రిపుల్ ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. బహుశా ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ ఉన్న స్టార్లను చూసే నాటి రచయితలకు అలాంటి వైవిధ్యమైన పాటలు రాసే ఆలోచన వచ్చి ఉంటుంది. తన వ్యసనాన్ని కూడా ఒక హోదాగా మార్చుకున్న ఆ హీరో ఎవరో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.

ఒక వ్యసనం మనిషిని ఎంతటి ఖరీదైన నిర్ణయాల వైపు నడిపిస్తుందో చెప్పడానికి ఈ స్టార్ హీరో నిలువుటద్దం. సామాన్యులకు ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించే ఈ అలవాటు.. ఆ స్టార్ హీరోకు మాత్రం ఒక లగ్జరీ అవసరంగా మారిపోయింది. ఏదేమైనా.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏల్తున్న కింగ్‌కు త‌న జీవ‌న‌ శైలిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేనే లేదు! డబ్బే మనిషికి స్వేచ్ఛను ఇస్తుందని ఆయ‌న ప‌క్కాగా ప్రూవ్ చేసారు.. అంతే!

Tags:    

Similar News