'రాకా' లో విల్ స్మిత్ ప్రచారం నిజమేనా?
ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండ్ విల్ స్మిత్ నిజంగా భాగమైతే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద క్రాస్-ఓవర్ ప్రాజెక్ట్‌గా నిలిచి హాలీవుడ్ మార్కెట్‌లోనూ భారతీయ సినిమా సత్తాను చాటుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వర్ల్డ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం `రాకా`. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే మునుపెన్నడూ లేని భారీ బడ్జెట్ - అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే విజువల్ వండర్‌లో హాలీవుడ్ ఆస్కార్ విజేత, సూపర్‌స్టార్ విల్ స్మిత్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి.
కొన్ని వారాలుగా అంతర్జాతీయ సినీ వర్గాలు, సోషల్ మీడియా వేదికల్లో `రాకా`లో విల్ స్మిత్ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్ పాత్రకు పోటీగా ప్రతినాయకుడి పాత్రను అట్లీ రూపుదిద్దారని.. ఆ పాత్ర కోసం విల్ స్మిత్‌తో కొన్ని నెలలుగా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విల్ స్మిత్ కు 80 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేశారనే వార్తలు కూడా వెలువడటంతో ప్రాజెక్ట్ పరిధి ఎంత విస్తృతమైనదో వైరల్ అవుతోంది.
ఈ గ్లోబల్ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఇటీవల లీక్ అయిన కొన్ని బిహైండ్ ద సీన్స్ .. కాస్ట్యూమ్ డిజైన్ లీకులు అభిమానులలో అంచనాలను రెట్టింపు చేశాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విల్ స్మిత్ క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన కాస్ట్యూమ్ డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, విదేశాలలో జరిగే ప్రత్యేక షెడ్యూల్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. చిత్ర మేకర్స్ నుండి ఇప్పటికిప్పుడు స్పష్టమైన ప్రకటన రాకపోయినా? అంతర్జాతీయ లొకేషన్లు , ప్రొడక్షన్ విశేషాలు ఈ సంచలన కాస్టింగ్‌కు పరోక్ష క్లూలుగా నిలుస్తున్నాయి.
దర్శకుడు అట్లీ మునుపటి చిత్రం `జవాన్ ` తో భారతదేశం వ్యాప్తంగా రికార్డుల సునామీ సృష్టించారు. తాజాగా `రాకా` ఇండియన్ సినిమా సరిహద్దులకే పరిమితం కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేలా పక్కా వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. నిజంగా ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండ్ విల్ స్మిత్ నిజంగా భాగమైతే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద క్రాస్-ఓవర్ ప్రాజెక్ట్‌గా నిలిచి హాలీవుడ్ మార్కెట్‌లోనూ భారతీయ సినిమా సత్తాను చాటుతుంది. అయితే ఈ బజ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నా? నిర్మాణ సంస్థ .. దర్శకుడు అట్లీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
విల్ స్మిత్ కాల్‌షీట్లు, అంతర్జాతీయ లొకేషన్ల షెడ్యూల్స్ లాక్ అయిన తర్వాతే మేకర్స్ మైండ్ బ్లోయింగ్ సర్ప్‌రైజ్‌ను అధికారికంగా ప్రపంచానికి వెల్లడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ధ్రువీకరణ వచ్చే వరకు ఇది కేవలం ప్రచారం అయినా? అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ వార్తతో పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి ప్రచారం పరంగా `రాకా` చిత్రం చుట్టూ తిరుగుతున్న విల్ స్మిత్ వార్తలు భారతీయ సినిమా ఆశయాలను, మార్కెట్ పరిధిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. నిజంగా ఇండియన్ ఐకాన్ మాస్ అల్లు అర్జున్ - హాలీవుడ్ మాస్టర్ విల్ స్మిత్ ఒకే ఫ్రేమ్‌లో ముఖాముఖి తలపడితే? ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.