• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజనీ కొత్త పోస్టర్.....

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

| 'ధర్మన్' దీపావళి పోస్టర్‌లో రజనీకాంత్ బ్లూ షర్ట్, బ్లాక్ ట్రౌజర్, సన్‌గ్లాసెస్‌తో సింపుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. 75 ఏళ్ల వయసులోనూ తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్నారు. అశ్వత్ మారిముతు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. నయనతార, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

By - M Prashanth
Update: 2026-11-08 11:14 GMT

రజనీకాంత్ సినిమా అంటే చేతిలో గన్, పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ గుర్తొస్తాయి. అయితే ఆయనకు అలాంటివేమీ లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునే స్టైల్ కూడా ఉంది. ఇప్పుడు 'ధర్మన్' దీపావళి పోస్టర్‌లో అదే కనిపిస్తోంది. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్, సన్‌గ్లాసెస్‌తో రజనీ చాలా సింపుల్‌గా ఉన్నారు. మెడ దగ్గర చైన్ సరిచేసుకుంటూ నిలబడిన స్టిల్‌లో ఆయన మార్క్ స్టైల్ కనిపిస్తోంది. 75 ఏళ్ల వయసులోనూ రజనీ ఇలాంటి లుక్స్‌తో ఆకట్టుకోవడం విశేషం.




 


నిజానికి రజనీకాంత్ కెరీర్ మొదటి నుంచి ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సిగరెట్ తిప్పడం, కళ్లజోడు పెట్టుకోవడం, నడిచే విధానం.. ఇలా చిన్న చిన్న మూమెంట్స్‌తోనే ఎన్నో సినిమాల్లో అభిమానులను అలరించారు. 'బాషా'లో ఆటోడ్రైవర్‌గా కనిపించినా, 'పడయప్ప'లో నార్మల్ దుస్తుల్లో ఉన్నా ఆయన స్టైల్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో రజనీ చేసిన కొన్ని మూమెంట్స్‌ను ఇప్పటికీ అభిమానులు అనుకరిస్తుంటారు.

ఇటీవల వచ్చిన 'జైలర్', 'కూలీ' సినిమాల్లో రజనీని ఎక్కువగా సీరియస్ లుక్స్‌తో చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ 'ధర్మన్' పోస్టర్‌లో మాత్రం ఆయుధం లేకుండా, భారీ కాస్ట్యూమ్స్ లేకుండా కనిపించారు. వెనకాల కార్లు, సిటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ రజనీ స్టైలింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సన్‌గ్లాసెస్, హెయిర్ స్టైల్, ఆయన నిలబడిన విధానం పోస్టర్‌లో హైలెట్ అయ్యాయి.

ఇక డిసెంబర్ 12తో ఆయన 76వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఈ వయసులోనూ వరుసగా భారీ సినిమాలు చేస్తూ, యువ దర్శకులతో పనిచేస్తున్నారు. 'జైలర్ సీరిస్' కోసం నెల్సన్ దిలీప్ కుమార్, 'కూలీ' కోసం లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు 'ధర్మన్' కోసం అశ్వత్ మారిముతును ఎంచుకున్నారు. ఆయన గతంలో చేసిన 'ఓ మై కడవులే', 'డ్రాగన్' సినిమాలు యువ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

అయితే రజనీ స్టైల్‌లో వయసుతో పాటు కొన్ని మార్పులు కూడా వచ్చాయి. ఒకప్పుడు వేగంగా చేసే స్టెప్పులు, ఫైట్లు అసలైక కిక్ ఇచ్చేవి. ఇప్పుడు నెమ్మదిగా నడవడం, చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం, కళ్లజోడు సరిచేసుకోవడం వంటి మూమెంట్స్‌తోనే అభిమానులను అలరిస్తున్నారు. 'జైలర్' లో ముత్తువేల్ పాండియన్ పాత్రకు ఈ తరహా స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఉపయోగపడింది. 'ధర్మన్' పోస్టర్‌లోనూ అలాంటి స్టైలింగ్ కనిపిస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్'కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. నయనతార, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా వంటి నటీనటులు సినిమాలో కనిపించనున్నారు. దర్శకుడు అశ్వత్ మారిముతు రజనీని జెన్ జీ ప్రేక్షకులకు నచ్చేలా చూపించాలనుకుంటున్నట్లు గతంలో చెప్పారు.

Tags:    
  • rajinikanth 
  • dharman 
  • ashwathmarimuthu 
  • kamalhaasan 
  • anirudh 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS