2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!
| 2027 సంక్రాంతి సినిమాలు పలువురు హీరోయిన్లకు కీలకంగా మారాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి, అనస్వర రాజన్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య లక్ష్మి, మానస వారణాసి భారీ విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌లో కీర్తి, కృతి నటిస్తుండగా, చిరంజీవి ‘కాకా’లో అనస్వర, బాలకృష్ణ ‘దాదా’లో కాజల్ కనిపించనున్నారు. ‘సంబరాల ఏటిగట్టు’, ‘జార్జ్ క్రిష్’ సినిమాలతో ఐశ్వర్య లక్ష్మి, మానస కూడా హిట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
సంక్రాంతి వస్తుందంటే? థియేటర్ల వద్ద హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయి. బాక్సాఫీస్ వద్ద ఏ హీరో పై చేయి సాధిస్తాడా? అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఫెయిలైన హీరోలు సైతం కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే వచ్చే సంక్రాంతి అలాంటి వాళ్లకే పరిమితం కాలేదు. భారీ విజయాల కోసం ఎదురు చూస్తోన్న భామలు కొంత మంది ఉన్నారు.
కీర్తి సురేష్, కృతి శెట్టి, అనస్వర, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య లక్ష్మి మానసా వారణాసి లాంటి యువ భామలు హిట్ రేసుతో గెలుపు జెండా ఎగరేయాలని ఎదురు చూస్తున్నారు. విక్టరీ వెంకటేష్-కళ్యాణ్ రామ్ కథానాయకులుగా హిట్ మెషిన్ అనీల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇద్దరు భామలు కొంత కాలంగా ఫామ్ లో లేని వాళ్లే. విజయం కోసం ఎదురు చూస్తు న్నారు. ఈ క్రమంలో తలుపు తట్టిన అవకాశం ఇది. దీంతో ఈ సినిమాతో హిట్ అందుకుని హీరోయిన్ల రేసులో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో `కాకా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అనసర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. నటించింది కొన్ని సినిమాలే అయినా? అమ్మడికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. `కాకా` విజయం సాధిస్తే ఆ గుర్తింపు రెట్టింపు అవుతుంది. ఇక చందమామ కాలజ్ అగర్వాల్ మామ్ అయినా? తగ్గేదేలే అంటూ ఛాన్సులందుకుంటుంది. రిటైర్మెంట్ తీసుకుంటుంది అనుకున్న కాజల్ ఒక్కసారిగా `దాదా` సినిమాలో హీరోయిన్ గా ఎంపికై షాక్ ఇచ్చింది.
ఇందులో అమ్మడు బాలయ్యకు జోడీగా నటిస్తుంది. ఈ సినిమా గనుక హిట్ అయితే? కాజల్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం. అదే జరిగితే అమ్మడు టాలీవుడ్ లో వరుసగా కొత్త అవకాశాలతో మళ్లీ బిజీ అవుతుంది. వయసు...మామ్ అవ్వడం అన్నది చెప్పుకోవడానికే తప్ప అవకాశాలకు ఆ రెండు అడ్డంకి కాదని నిరూపించే నాయికల్లో తొలి స్థానం కాజల్ దే అవుతుంది. అలాగే మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో `సంబరాల ఏటిగట్టు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఇంకా శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో జార్జ్ క్రిష్ తెరకెక్కుతోంది. ఇందులో శర్వా సరసన మానాసా వారణాసి నటిస్తోంది. ఈ రెండు సినిమాల విజయం టీమ్ అందరికీ అత్యంత కీలకం. ప్రత్యేకించి హీరోయిన్లు ఈ రెండు సినిమాలో టాలీవుడ్ లో బిజీ భామలగా మారలని ప్రయత్నిస్తున్నారు. మరి 2027 సంక్రాంతి రిలీజ్ లతో నయా భామలు ఎలాంటి విక్టరీలు అందుకుంటారు? అన్నది చూడాలి.