కయాదు సింగిలేనా? పెళ్లి చేసుకోవాలని ఉందట..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్‌ కయాదు లోహర్‌. ఇటీవల ఈమె నటించిన 'ఫంకీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2026-03-14 10:30 GMT

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్‌ కయాదు లోహర్‌. ఇటీవల ఈమె నటించిన 'ఫంకీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేక పోయింది. అయినా కూడా ఈమె జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో అయిదు ఆరు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఈమె రెండు మూడు సినిమాలు చేస్తోంది. తమిళ్‌లో ఈమె స్టార్‌ హీరోల సినిమాలను కమిట్‌ అయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలో ఇంత బిజీ కావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే అతి త్వరలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కయాదు లోహర్‌ ప్రేమలో ఉందా...

పెళ్లి గురించి ఆ ఇంటర్వ్యూలో కయాదు లోహర్‌ను యాంకర్‌ ప్రశ్నించిన సమయంలో క్లీయర్ సమాధానం ఇచ్చింది. పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని, తప్పకుండా తాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే యాంకర్‌ మాట్లాడుతూ కయాదు లోహర్‌ ప్రేమలో ఉందా, ఎవరితో అయినా రిలేషన్‌లో ఉందా అంటూ ప్రశ్నించింది. అప్పుడు కయాదు గట్టిగా నవ్వుతూ ప్రస్తుతానికి నేను పనితోనే రిలేషన్‌లో ఉన్నాను, పనితో మాత్రమే ప్రేమలో ఉన్నాను అని నవ్వింది. క్లీయర్‌గా చెప్పాలంటే నేను సింగిల్‌గానే ఉన్నాను. కమిట్‌ కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. గతంలో ఈమె ఒక యంగ్‌ హీరోతో ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలపై కయాదు స్పందించలేదు. దాంతో కయాదు ప్రేమ వ్యవహారం గురించి అంతా సైలెంట్‌ అయ్యింది. ప్రస్తుతానికి సింగిల్‌ అయినప్పటికీ తాను భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

డ్రాగన్‌ మూవీతో కయాదు లోహర్‌కి...

కన్నడ మూవీ ముగిల్‌పేటతో 2021లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కయాదు లోహర్‌ తమిళ మూవీ 'డ్రాగన్‌' తో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకుంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్రాగన్ మూవీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కయాదు వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. గత ఏడాది అర డజనుకు పైగా సినిమాలు సైన్‌ చేసిందట. వాటిల్లో ఈ ఏడాది కనీసం నాలుగు అయిదు అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫంకీతో వచ్చిన కయాదు మరిన్ని సినిమాలను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. వాటిల్లో ఒకటి రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా ఆమె స్టార్‌డం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కయాదు లోహర్‌ అందంతో పాటు నటనతో ఆకట్టుకుంటూ ఉంది. అందుకే ఆమె వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది.

STR49 సినిమాలో కయాదు లోహర్‌

2021లో టైమ్స్ ఫ్రెష్‌ ఫేస్ కాంపిటీషన్‌లో పాల్గొనడం ద్వారా ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులోనూ ఈమె గతంలో అల్లూరి సినిమాలో నటించింది. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకోక పోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు రాలేదు. కానీ డ్రాగన్‌ సినిమాతో తెలుగులోనూ హిట్‌ కొట్టింది. ఒక డబ్బింగ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ముందు ముందు ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. తమిళ్‌లో ఈమె చేస్తున్న STR49 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమా హిట్‌ అయితే తెలుగులోనూ స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి. కయాదు లోహర్‌ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం ఉండబోతుంది. కనుక ఇప్పట్లో ఆమె పెళ్లి చేసుకోదు, కానీ ఎప్పటి వరకు సింగిల్‌గా ఉంటుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News