పవన్ 'ఉస్తాద్' ప్రీమియర్స్.. మేకర్స్ ప్లానేంటి?

ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ ను ఉస్తాద్ మేకర్స్ ఫాలో అవ్వనున్నారన్న మాట. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ప్రీమియర్ షోలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.;

Update: 2026-03-14 09:43 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ఉగాది కానుకగా థియేటర్స్ లో మార్చి 19వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ తోపాటు అభిమానుల్లో మంచి అంచనాలు ఉండగా.. సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా హరీష్- పవన్ కాంబోలో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ గా నిలవడంతో.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అందరి దృష్టి పడింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా ప్రీమియర్స్ సంగతేంటన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మేకర్స్ ప్లాన్ ఏంటోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

నిజానికి.. ఓవర్సీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీమియర్స్ ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏపీలో ప్రీమియర్స్ బదులు ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోస్ వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ షో టికెట్ ధర సుమారు రూ.500 వరకు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొన్నేళ్లు క్రితం వరకు చాలా సినిమాలకు బెనిఫిట్ షోలు మాత్రమే పడేవి.

ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ ను ఉస్తాద్ మేకర్స్ ఫాలో అవ్వనున్నారన్న మాట. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ప్రీమియర్ షోలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అక్కడ రాత్రి ప్రీమియర్స్ ఉంటాయా, లేక ఉదయం బెనిఫిట్ షోలు వేస్తారా అనే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో నిర్ణయం తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపు కావాలంటే 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే లభించింది. దీంతో ఇప్పుడు మైత్రీ సంస్థ.. రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్స్ కోసం అనుమతులు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనుందని సమాచారం.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికొస్తే.. పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివ్యేందు శర్మ, అశుతోష్ రాణా, నవాబ్ షా, శంకర్ పార్థిబన్, గౌతమి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. మరి తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News