గుండెల్లో బాబాయ్ కాక‌పుట్టించిన క‌న‌క‌రాజ్!

హారర్ కామెడీ జానర్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చారం కార్య‌క్రమాలు వేగంగా జ‌రుగుతున్నాయి.

Update: 2026-08-01 14:06 GMT

టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ జ‌ర్నీ ఎలా సాగుతుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. డాడ్ నాగ‌బాబు పెద్ద స్టార్ కాక‌పోయినా? మెగా ఇమేజ్ తో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైనే ఇమేజ్ ను సంపాదించుకుని ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాలు అందుకున్నా? ఈ మ‌ధ్య కాలంలో వ‌రుణ్ వేగం త‌గ్గింది. దీంతో త‌దుప‌రి చిత్రం 'కొరియ‌న్ క‌న‌క‌రాజ్' తో ఓ డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చారం కార్య‌క్రమాలు వేగంగా జ‌రుగుతున్నాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ స్టేజ్ పై మాట్లాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసారు. మైక్ పట్టుకుని సినిమా విశేషాలు చెబుతున్న సమయంలో క్రింద ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ `బాబులకే బాబు కళ్యాణ్ బాబు` అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వరుణ్ తేజ్ కళ్ల ముందే ఫ్యాన్స్ పవన్ నామస్మరణతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించడంతో అక్క‌డ ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది.

అభిమానులు అలా అరుస్తున్న సమయంలో వరుణ్ తేజ్ స్పందించిన తీరు అక్కడున్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా వారి మాటలను ఎంతో ఆప్యాయంగా ఆస్వాదించిన వరుణ్ తేజ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. వేదికపైనే నిలబడి తన చేతిని గుండెపై వేసుకుని గట్టిగా ఊపుతూ `కళ్యాణ్ బాబాయ్ నా గుండెల్లో ఉంటారు` అంటూ ఎమోషనల్‌గా సైగ చేశారు. ఆయన చూపిన ఆ అంకితభావం .. బాబాయ్ పట్ల ఉన్న ప్రేమను చూసి ఫ్యాన్స్ మరింత సంతోషంతో కేకలు వేశారు.

మెగా కుటుంబంలో ఉండే ప‌ర‌స్పర‌ గౌరవం, బాబాయ్ - అబ్బాయ్‌ల మధ్య ఉండే విడదీయరాని అనుబంధం ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది. వరుణ్ తేజ్ హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగినా? కుటుంబ పెద్దలపై.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆయన చూపించే అభిమానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని మరోసారి రుజువైంది. ఈ వీడియో క్లిప్ ఎక్స్ సోషల్ మీడియా వేదికలలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ రకరకాల ఎమోషనల్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

వరుణ్ తేజ్ కెరీర్‌ పరంగా ఎంతో కీలకమైన దశలో ఉన్నా? అభిమానుల మధ్య కుటుంబ బంధాలను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ప్రేమను చాటుకున్న తీరు ఎంతో హృద్యంగా నిలిచింది. వేదికపై అభిమానుల కేకలకు వరుణ్ తేజ్ ఇచ్చిన స్పందన మెగా కుటుంబం ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. మెగా ఫ్యామిలీలో ఏ హీరో ముందైనా? ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే? రియాక్ష‌న్ అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది.


Tags:    

Similar News