వెండి తెరకు సంచలన ఉద్యమగాథ!
ఇటీవల ఢిల్లీలోని `జంతర్ మంతర్` వేదికగా నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా విద్యార్దులు చేపట్టిన నిరసన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.
ఇటీవల ఢిల్లీలోని `జంతర్ మంతర్` వేదికగా నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా విద్యార్దులు చేపట్టిన నిరసన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీద్ దీప్కే అధ్యక్షతన మొదలైన పోరాటం... సామాజిక వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆరమరణ నీరహార దీక్షతో పీక్స్ కు చేరింది. గతంలో న్యాయం కోసం, హక్కుల సాధన కోసం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు రోడ్డెక్కి చేసిన ఆందోళనలు దేశ రాజకీయ దిశను మార్చేశాయి. తాజాగా జంతర్ మంతర్ ఘటన సినిమా రూపంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో? చూడాలి. అయితే ఈ ప్రచారం ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సంచలన చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఆందోళనలను పైపైనే చూపించకుండా ఆ నిరసనకు దారితీసిన అసలు పరిస్థితులు, తెరవెనుక జరిగిన రాజకీయ కుట్రలు, బాధితులు పడిన వేదనను అత్యంత వాస్తవిక కోణంలో సినిమాలో ఆవిష్కరించబోతున్నారు. దిల్లీ వీధుల్లో యువత, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎలాంటి పరిస్థితుల కారణంగా జంతర్ మంతర్ వద్దకు చేరవలసి వచ్చింది అనే కోణంలో బలమైన స్క్రిప్ట్‌ను ఓ స్టార్ దర్శకుడు సిద్ధం చేస్తున్నట్లు వినిపిస్తోంది.
బాలీవుడ్‌లో రియాలిటీ బేస్డ్.. బోల్డ్ పొలిటికల్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్టగా పేరుగాంచిన ఓ ప్రముఖ దర్శ కుడు ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా టేకప్ చేశారని సమాచారం. సినిమాలో ప్రధాన పాత్రల కోసం బాలీవుడ్‌లోని కొంత మంది యువ స్టార్లతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ప్రముఖ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారుట. వాస్తవ ఘటనలకు సినిమాటిక్ హంగులను అద్ది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా కథను రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమా ప్రకటన అధికారికంగా వెలువడిన క్షణం నుంచే వివాదాలు కూడా చుట్టుముట్టే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు సున్నితమైన రాజకీయ అంశాలతో ముడిపడి ఉండటంతో సెన్సార్ బోర్డ్ అడ్డంకులు ..వివిధ రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయినా? మేకర్స్ మాత్రం ఎలాంటి రాజీపడకుండా సమాజానికి బలమైన సందేశాన్ని ఇచ్చేలా చిత్రాన్ని నిర్మిం చాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌పై చర్చ మొదలైంది. ఒక ఉద్యమం ఏ విధంగా పుట్టుకొస్తుంది? ప్రభు త్వాలు వాటికి ఎలా స్పందిస్తాయి? అనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్న సినిమాపై మేధావుల నుంచి కూడా ప్రశంసలొస్తున్నాయి. కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా సమాజంలో మార్పును కోరుకునే రియాల్టీ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు.