భన్సాలీ కథానాయికలా మురిపిస్తున్న సారా టెండూల్కర్
సారా టెండూల్కర్ తన సోదరుడి వివాహ వేడుకల్లో `కుందనపు బొమ్మ`లా మెరిసిపోయింది. తను ధరించిన దేశీ దుస్తులు ఆమెకు ఒక ప్రత్యేకమైన గ్లామర్ అద్దాయి.;
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త సానియా చందోక్ త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సచిన్ గారాల పట్టి సారా టెండూల్కర్ తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన సోదరుడి మెహందీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను సారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్ అయ్యాయి.
సారా టెండూల్కర్ తన సోదరుడి వివాహ వేడుకల్లో `కుందనపు బొమ్మ`లా మెరిసిపోయింది. తను ధరించిన దేశీ దుస్తులు ఆమెకు ఒక ప్రత్యేకమైన గ్లామర్ అద్దాయి. సంగీత్ వేడుక కోసం ఎంపిక చేసుకున్న లెహంగా .. భారీ ఆభరణాలు ఈ బ్యూటీలోని రాజసాన్ని ఉట్టిపడేలా చేశాయి. సారా చిరునవ్వు, ఆ హొయలు చూస్తుంటే ఒక టాప్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే భన్సాలీ సినిమాలో కథానాయికలా కనిపిస్తోందని ప్రశంసిస్తున్నారు.
సారా కేవలం సచిన్ కుమార్తెగానే కాకుండా ఒక టాప్ మోడల్‌గా.. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ (వ్యాపారవేత్త)గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఒక వెల్‌నెస్ సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా దాని బ్రాంచీలను విస్తరిస్తోంది. అల్ట్రా స్టైలిష్ మోడరన్ లుక్స్ నుండి పద్ధతైన ట్రెడిషనల్ వేర్ వరకు ఈ బ్యూటీ ప్రతి లుక్‌లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెళ్లి వేడుకలో సారా లుక్ గురించి ప్రస్తుతం ఇంటర్నెట్ లో చర్చ సాగుతోంది.
అర్జున్ టెండూల్కర్ - సానియా చందోక్ వివాహ బడ్జెట్ విషయంలో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేకపోయినా...ఇది అత్యంత విలాసవంతంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ప్రముఖ హోటళ్లతో పాటు విదేశాల్లో కూడా కొన్ని వేడుకలు ప్లాన్ చేసినట్లు సమాచారం. క్రికెట్ దిగ్గజం కుమారుడి పెళ్లి కావడంతో కోట్లాది రూపాయల బడ్జెట్‌తో ఈ ఈవెంట్ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోంది.
ఈ పెళ్లికి హాజరయ్యే అతిథుల జాబితా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. క్రికెట్ రంగం నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎం.ఎస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు బిసిసిఐ ప్రముఖులు రాబోతున్నారు. అలాగే అంబానీ కుటుంబం కూడా ఈ పెళ్లి వేడుకల్లో మెరవనుంది. ఇక రాజకీయ ప్రముఖులు కూడా సచిన్ ఆహ్వానం మేరకు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.
సినీ తారల విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్‌స్టార్లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని సమాచారం. సచిన్ సన్నిహిత మిత్రులైన రణవీర్ సింగ్, దీపికా పదుకొనే కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు. మొత్తానికి అర్జున్ టెండూల్కర్ వివాహం దేవలోకంలో రాకుమారుడి పెళ్లిలా జరగనుందని సమాచారం.