శ్రీవిష్ణు 'మృత్యుంజయ్'.. రెండో వీకెండ్‌ లోనూ అదే స్పీడ్!

ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీవిష్ణు జయ్ అనే న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించారు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల మిస్టరీని ఛేదించేందుకు అతడు చేసే ప్రయత్నాలే కథకు మెయిన్ ఎలిమెంట్.;

Update: 2026-03-14 09:43 GMT

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రెస్పాన్స్ తో ముందుకు సాగుతోంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఆ చిత్రం మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీక్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఆ మూవీ.. ఇప్పుడు రెండో వీకెండ్‌ లో కూడా మంచి రెస్పాన్స్ తో థియేటర్లలో కొనసాగుతోంది.

ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్ బుక్ మై షోలో ఇప్పటికే మంచి రేటింగ్స్ సంపాదించుకున్న మృత్యుంజయ్ మూవీకి గత 24 గంటల్లో ఐదు వేలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం విశేషం. దీంతో సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. సినీ ప్రియులు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. బుక్ మై షో ట్రెండ్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో శనివారం, ఆదివారం రోజుల్లో మృత్యుంజయ్ మూవీ ఉన్న థియేటర్లలో ఆడియన్స్ రద్దీ పెరిగే అవకాశం ఉందని క్లియర్ గా తెలుస్తోంది. అయితే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు మృత్యుంజయ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుండడం వల్ల.. సినిమా మరికొద్ది రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ గా కొనసాగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీవిష్ణు జయ్ అనే న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించారు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల మిస్టరీని ఛేదించేందుకు అతడు చేసే ప్రయత్నాలే కథకు మెయిన్ ఎలిమెంట్. ఒకే తరహాలో జరుగుతున్న హత్యలు పోలీసులను గందరగోళానికి గురి చేస్తాయి. ఆ కేసు వెనుక ఉన్న అసలు నిందితుడిని కనుగొనే క్రమంలో హీరో క్లూస్ వెతుకుతూ, అనుమానాస్పద వ్యక్తులను ఫాలో అవుతూ ముందుకు సాగుతారు. ఆ సమయంలో మైండ్ గేమ్స్, ట్విస్టులు ఆసక్తి పెంచుతాయి.

స్టోరీ కొంతవరకు రొటీన్‌ గా అనిపించినప్పటికీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు కథను మలిచారు. ముఖ్యంగా నగరంలో జరుగుతున్న హత్యల వెనుక దాగి ఉన్న మిస్టరీ క్రమంగా బయట పెట్టే విధానం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీవిష్ణు తన పాత్రకు తగ్గట్టుగా నేచురల్ యాక్టింగ్ తో మెప్పించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించే ఏసీపీ సీత పాత్రలో రెబా మోనికా జాన్ కనిపించారు.

ఆమె పాత్రను కథలో కీలక మలుపులు తీసుకువచ్చేలా రూపొందించారు దర్శకుడు. ఇద్దరి మధ్య జరిగే దర్యాప్తు సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. టెక్నికల్ గా కూడా సినిమా మంచి రేంజ్ లో ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మెయిన్ అసెట్ గా నిలిచింది. థ్రిల్లర్ సీన్స్ లో ఉత్కంఠను పెంచడంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. మరి మీరు మృత్యుంజయ్ మూవీ చూశారా?

Tags:    

Similar News