భార్యతో కలిసి తొలి దీపావళి జరుపుకున్న చైతూ.. ఫోటోలు వైరల్!

అందులో భాగంగానే తాజాగా భార్యతో కలిసి తొలి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.;

Update: 2025-10-21 07:25 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కింగ్ నాగార్జున వారసుడిగా అడుగుపెట్టారు నాగచైతన్య. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు. కానీ తండ్రికి తగ్గ స్టార్ స్టేటస్ అయితే లభించలేదు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగతంగా పలుమార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు ఇచ్చి ఆమెకు దూరం అయ్యారు. 2021లో విడాకులు తీసుకోగా.. 2022లో శోభితతో ఒక రెస్టారెంట్లో కనిపించి అనుమానాలకు ఆజ్యం పోశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు రాగా గత ఏడాది నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.



 


ఇక అదే ఏడాది నవంబర్లో అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు ,సన్నిహితుల మధ్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశారు నాగచైతన్య. ఇదిలా ఉండగా వివాహం జరిగిన తర్వాత శోభితతో పలు ఈవెంట్లకు, సినిమా ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు హాజరవుతూ తెగ సందడి చేస్తున్నాడు నాగ చైతన్య. అందులో భాగంగానే తాజాగా భార్యతో కలిసి తొలి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. భార్యతో కలిసి తొలి దీపావళి పండుగ అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేసుకున్నారు. ఇందులో కుర్తీలో చాలా అందంగా ముస్తాబైన నాగచైతన్య.. అటు శోభిత కూడా పర్పుల్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. వీరిద్దరూ తమ ఇంట తొలి దీపావళి పండుగను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు లవ్ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.



 


నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఎన్సీ 24 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా పౌరాణిక థ్రిల్లర్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇందులో స్పర్శ్ శ్రీనివాస కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.



 


శోభిత ధూళిపాల విషయానికి వస్తే.. పేరుకే తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ పరిశ్రమ ఈమెను బాగా ఆదరించింది. అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఈమె.. ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందో అప్పటినుంచి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ ద మారిపోయింది. అప్పటినుంచి శోభిత పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు తెలుగు ఈవెంట్లలో సందడి చేస్తూ అందరిని అబ్బురపరుస్తోంది. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.



 


Tags:    

Similar News