ట్రోల‌ర్ల‌కు నొప్పి తెలియ‌కుండా శోభిత చికిత్స‌

శోభిత ధూళిపాళ ఏ ఫ్రేమ్‌లో క‌నిపించినా ఆ ఫ్రేమ్‌కి అందం వ‌చ్చేస్తుంది. ఇటీవ‌ల అఖిల్ అక్కినేని పెళ్లిలో వ‌దిన‌మ్మ శోభిత సంద‌డి గురించే చ‌ర్చ సాగింది;

Update: 2025-06-17 17:35 GMT

శోభిత ధూళిపాళ ఏ ఫ్రేమ్‌లో క‌నిపించినా ఆ ఫ్రేమ్‌కి అందం వ‌చ్చేస్తుంది. ఇటీవ‌ల అఖిల్ అక్కినేని పెళ్లిలో వ‌దిన‌మ్మ శోభిత సంద‌డి గురించే చ‌ర్చ సాగింది. వేడుక‌లో బెస్ట్ ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోయింది శోభిత‌. అయితే ఈ బ్యూటీ ఫ్యాష‌న్ సెన్స్ గురించి కాదు కానీ, ఈసారి సైలెంట్ గా ఆమె పేల్చిన నిశ్శ‌బ్ధ బాంబ్ గురించే చ‌ర్చ‌.

త‌న‌ని ఆడిపోసుకోవాల‌నుకునే నెటిజ‌నుల‌కు సోషల్ మీడియాలో సింపుల్ గా నొప్పి తెలీనివ్వ‌కుండా కౌంట‌ర్ ఇచ్చింది శోభిత‌. ``అంత‌టా ఉండండి... అస‌లేమీ ఉండకండి.. మీరు మీరుగా ఉండండి`` అని కోట్ ని షేర్ చేసింది. దీన‌ర్థం ఎవ‌రు ఎలా ఉన్నా తాను ఉండాల్సిన విధానంలోనే ఉంటాన‌నే సందేశాన్ని ఎదుటివారికి ఇవ్వ‌డం.

ఇది సైలెంట్ గా త‌న‌ను అన్న‌వారికి కౌంట‌ర్. అంద‌రికీ బాగానే గుచ్చుకుంది. కానీ దీనిని కూడా కొంద‌రు నెటిజ‌నులు స్టేట్ మెంట్ గా మాత్ర‌మే భావించి రీపోస్ట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అఖిల్ పెళ్లిలో చైతూతో పాటు సందడి చేసిన శోభిత‌ను ఫ్యాన్స్ స‌మంత‌తో పోల్చ‌డం వింతైన‌ది. అయితే అన్నిటికీ సింపుల్ కొటేష‌న్ తో కౌంట‌ర్ ఇచ్చింది శోభిత‌.

తాను షేర్ చేసిన వాటిలో ఒక ఫోటోలో నాగార్జునకు వామ్ హ‌గ్ ఇచ్చింది. మ‌రొక ఫోటోలో పెళ్లి నుండి డీజేని చూపించింది. కానీ ఆమె కోట్‌తో జత చేసిన చివరి ఫోటోగ్రాఫ్ అస‌లైన ప్రభావాన్ని చూపింది. ఇది ఇత‌రుల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ కాదు... ట్రోల‌ర్ల‌కు బిగ్ కౌంట‌ర్. ఎవ‌రికి వారు ఏదో ఒక కామెంట్ చేయడం స‌రికాదు.. ఫ్యామిలీ బాండింగ్స్ ని కూడా అర్థం చేసుకోవాల‌ని సింపుల్ గా ప్ర‌క‌టించింది.

Similar News