ఆ ఒక్క విష‌యంలో టాలీవుడ్ హీరోల్లో ఐక్య‌త‌!

పాన్ ఇండ‌యాలో స‌క్సెస్ అయిన త‌ర్వాత కొంద‌రు తెలుగు హీరోల‌కు బాలీవుడ్ అవ‌కాశాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌గామి నిర్మాణ సంస్థ‌లు..స్టార్ డైరెక్ట‌ర్లు తెలుగు హీరోల కోసం క్యూ క‌ట్టారు.;

Update: 2026-02-24 15:30 GMT

పాన్ ఇండ‌యాలో స‌క్సెస్ అయిన త‌ర్వాత కొంద‌రు తెలుగు హీరోల‌కు బాలీవుడ్ అవ‌కాశాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌గామి నిర్మాణ సంస్థ‌లు..స్టార్ డైరెక్ట‌ర్లు తెలుగు హీరోల కోసం క్యూ క‌ట్టారు. క‌ర‌ణ్ జోహార్ లాంటి వారైతే? పాన్ ఇండియాలో స‌క్సస్ అయిన హీరోలంద‌ర్నీ బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. `కాఫీ విత్ క‌ర‌ణ్` టాక్ షో వేదిక‌గా అంద‌ర్నీ మ‌చ్చిక చేసుకుని బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నం చేసాడు. కానీ ఆ ప‌ప్పులేవి ఉడ‌క‌లేదు. త‌మ్ముడు త‌మ్ముడే అన్న సామెంత చందాన క‌ర‌ణ్ ఎక్క‌డ క‌ట్ చేయాలో అక్క‌డ క‌ట్ చేసారు తెలుగు హీరోలు.

ఇందులో ఉన్న హీరోలెవ‌రెవ‌రు అంటే? తొలుత ప్ర‌భాస్..ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, బ‌న్నీ, విజయ్ దేవ‌ర‌కొండ‌. `బాహుబ‌లి` అనంత‌రం ప్ర‌భాస్ తో హిందీ సినిమా తీయాల‌ని క‌ర‌ణ్ చాలా ప్ర‌య‌త్నాలు చేసి ఫెయిల‌య్యాడు. అలాగే రామ్ చ‌ర‌ణ్ , తార‌క్ కోసం కొంత మంది అగ్ర‌ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు. ` పుష్ప` విజ‌యంతో బ‌న్నీపై అయితే? య‌శ్ రాజ్ ఫిలింస్ లాంటి సంస్థ‌నే ఆఫ‌ర్ చేసింది. ఎన్నికోట్లైనా పారితోషికం చెల్లిస్తాం. వ‌చ్చి మా బ్యాన‌ర్లో సినిమా చేయండ‌ని ఆఫ‌ర్ చేసింది. కానీ బ‌న్నీ ఆఫ‌ర్ ను సున్నితంగా తిర‌స్క‌రించాడు.

అలాగే `లైగ‌ర్` అనంత‌రం విజ‌య్ దేర‌కొండ తో సినిమా చేయాల‌ని క‌ర‌ణ్ ప్ర‌య‌త్నించాడు. అదీ జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యంలో హీరోలంతా ఎంతో ఐక్యంగా ఉన్నార‌నే చెప్పాలి. ఒకే మాట‌..ఒకే బాట అన్న ప‌ద్ద‌తే ఫాలో అయ్యారు. హిందీ భాష‌లో సినిమాలు చేస్తారంటే? ఆ న‌లుగురు నుంచి దాదాపు ఒకే స‌మాధానం వ‌చ్చింది. తాము ఏం చేయాలనుకున్నా? తెలుగు భాష నుంచే చేస్తాం త‌ప్ప ప‌ర భాష‌ల‌కు వెళ్లి ప్ర‌యోగాల‌కు చేయ‌మ‌ని తేల్చి చెప్పారు. బ‌న్నీ కూడా దాదాపు అలాగే స్పందించాడు. రామ్ చ‌ర‌ణ్ కూడా అదే మాట మీద ఉన్నాడు.

`జంజీర్` చిత్రాన్ని రీమేక్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా చేసారు. అదే చ‌ర‌ణ్ తొలి హిందీ చిత్రం. ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన రీమేక్ అది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హిందీ సినిమా వైపు చూడలేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా `లైగ‌ర్` చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో చేసాడు. అదే విజ‌య్ తొలి హిందీ చిత్రం. అప్ప‌టి నుంచి సైలెంట్ గా తెలుగు సినిమాలు త‌ప్ప మ‌రో భాష‌వైపు చూడ‌లేదు. `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ హిందీలో లాంచ్ అవ్వ‌డానికి ఆరేళ్లు స‌మ‌యం ప‌ట్టింది. ఆ చిత్ర‌మే `ఆదిపురుష్`. తెలుగు, హిందీలో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. నేరుగా బాలీవుడ్ టార్గెట్ గా మాత్రం ఏ తెలుగు హీరో ఇంత వ‌ర‌కూ సినిమా చేయ‌లేదు. భ‌విష్య‌త్ లో చేసే అవ‌కాశం కూడా ఉండ‌ద‌న్న‌ది అభిమానుల మాట‌.

Tags:    

Similar News