ప్యారడైజ్ 'ఆయా షేర్'.. నాని సాంగ్ అదుర్స్..

నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్ ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్‌ విడుదలై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2026-02-24 17:04 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్ ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్‌ విడుదలై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాని పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన ఆయా షేర్‌ సాంగ్.. అభిమానుల్లో జోష్ నింపుతోంది.



 


దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌ లో వస్తున్న ఆ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఆయా షేర్‌.. సాంగ్‌ మాస్‌, ఎనర్జీ, రగ్డ్ ఫీల్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటకు రాక్‌ స్టార్‌ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్.. హై వోల్టేజ్‌ ఫీల్‌ ను తీసుకొచ్చింది.

ట్రైబల్‌ బీట్స్‌ తో పాటు ఎలక్ట్రానిక్‌ సౌండ్స్‌ తో రూపొందిన ప్యారడైజ్ ఫస్ట్ ట్రాక్‌.. సినీ ప్రియులతోపాటు అభిమానులను తెగ మెప్పిస్తోంది. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్ కు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య తమ గాత్రంతో ప్రాణం పోయగా, అనిరుధ్‌ కూడా ఆలపించడం ప్రత్యేకత. వందలాది డ్యాన్సర్ల మధ్య నాని వేసిన స్టెప్పులు సాంగ్‌ కు మరింత గ్రాండ్‌ నెస్‌ తెచ్చాయి.

ఆ పాటను భారీ సెటప్‌ తో రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించినట్టు చిత్రబృందం తెలిపింది. అయితే లాంగ్‌ బ్రైడ్స్‌, గడ్డం, రఫ్‌ లుక్‌, రెడ్‌ బ్లేజర్‌ లో నాని కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలో ఆయన పూర్తిగా మాసీ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన విజన్‌ తో ఒక రా, ఇంటెన్స్‌ వరల్డ్ ను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్టు ఇప్పటికే టీజర్లు, పోస్టర్లు చెబుతున్నాయి.

ఇక ప్యారడైజ్ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సంపూర్ణేశ్‌ బాబు, రాఘవ్ జుయాల్‌, సోనాలి కులకర్ణి తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఎడిటర్‌ గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్‌ గా సీహెచ్‌ సాయి, ప్రొడక్షన్ డిజైనర్‌ గా అవినాష్ కొల్లా వర్క్ చేస్తున్నారు.

మొదట మార్చి 26వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని భావించిన ప్యారడైజ్ సినిమాను రీసెంట్ గా ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు మేకర్స్. పాన్‌ వరల్డ్‌ రేంజ్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ది ప్యారడైజ్‌ ఎలాంటి హిట్ గా నిలుస్తుందో చూడాలి. ఏదేమైనా తాజాగా వచ్చిన ఆయా షేర్‌.. సాంగ్‌ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి.


Full View


Tags:    

Similar News