ఫ్లాప్ వచ్చినా, ఆ హీరోయిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా !
సినీ ఇండస్ట్రీలో నటించిన సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, నటీనటుల క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉండటం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే చూస్తుంటాం.;
సినీ ఇండస్ట్రీలో నటించిన సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, నటీనటుల క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉండటం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే చూస్తుంటాం. ప్రస్తుతం అదే పరిస్థితి టాలెంటెడ్ హీరోయిన్ కయాదు లోహర్ విషయంలో కనిపిస్తోంది. రీసెంట్ గా అమ్మడు నటించిన ఫంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, కయాదుకు తెలుగులో అవకాశాలు మాత్రం తగ్గలేదు.
డ్రాగన్ తో భారీ గుర్తింపు
శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కయాదు, ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు అందుకోలేదు. కానీ తర్వాత ప్రదీప్ రంగనాధన్ తో చేసిన డ్రాగన్ మూవీ తో అమ్మడికి ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు లభించింది. ఆ సినిమా తర్వాత కయాదుకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంది.
ఫంకీలో హీరోయిన్ గా నటించిన కయాదు
డ్రాగన్ తర్వాత మరీ ముఖ్యంగా యూత్ లో ఆమెకు ఏర్పడిన క్రేజ్, సోషల్ మీడియాలో పెరిగిన ఫ్యాన్ బేస్ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే కయాదుకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన ఫంకీ సినిమాలో నటించిన కయాదు, ఆ సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తనకు ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.
రెండు తెలుగు ప్రాజెక్టులకు సైన్
కయాదు తాజాగా రెండు కొత్త తెలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాల కోసం ఒక్కో సినిమాకు అమ్మడు రూ. 1 కోటి వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కయాదు లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్లకు మామూలుగా రూ.1 కోటి రెమ్యూనరేషన్ అంటే ఓకే కానీ, ఫ్లాప్ తర్వాత కూడా అమ్మడు అదే రెమ్యూనరేషన్ ను తీసుకుంటుందంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థమవుతుంది.
అయితే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్.. లాంటి ఎన్నో అంశాలు ఒక హీరోయిన్ కు అవకాశాలను తెచ్చిపెడతాయని, కయాదు విషయంలో కూడా ఇదే జరుగుతుందని అర్థమవుతోంది. ఆల్రెడీ సైన్ చేసిన ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయితే, కయాదు కెరీర్ గ్రాఫ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.