• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్‌లో నాని రూటే...

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

| పాన్ ఇండియా సినిమాల కోసం స్టార్ హీరోలు ఏళ్ల సమయం తీసుకుంటుంటే.. నాని మాత్రం వరుస ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షెడ్యూల్ ఢిల్లీలో పూర్తయినట్లు సమాచారం. కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన టీమ్.. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తోంది. ఇదే వేగం కొనసాగితే నాని మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 06:43 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాల విడుదలకు చాలా సమయం పడుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. కానీ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు పూర్తి కావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతోంది. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నంగా వెళ్తున్నారు.

నాని తన సినిమాల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక సినిమా విడుదలైన వెంటనే మరో సినిమాపై దృష్టి పెట్టడం ఆయనకు అలవాటుగా మారింది. స్టార్ హీరోలు ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ సమయంలో నాని మాత్రం తన సినిమాలను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

ఇప్పుడు నాని తన కొత్త సినిమా బ్లడీ రోమియోతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమా మొదలైన కొద్ది రోజులకే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.

నాని సినిమాల సెలక్షన్ తో పాటు షూటింగ్ వేగం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోలు తమ సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న తరుణంలో నాని మాత్రం వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారు.

ఇదే వేగంతో నాని సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఆయనకు మరింత బలమైన మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ‘బ్లడీ రోమియో’తో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ సినిమా కానీ సూపర్ హిట్ అయితే తప్పకుండా మన అందరి హీరోలు పాన్ ఇండియా మార్కెట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్న సమయంలో నాని ఇక్కడ తెలుగులో టాప్ చైర్ ఆక్రమించడం ఖాయం.

Tags:    
  • nani 
  • bloodyromeo 
  • tollywood 
  • sujeeth 
  • telugucinema 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS