విరోష్ ప్రీమియర్ లీగ్... విజయ్ - రష్మిక ప్లాన్ అదుర్స్!

టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.;

Update: 2026-02-24 16:59 GMT

టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గత కొన్నేళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, విజయ్ , రష్మిక తమ వివాహాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) పేరును తమ వెడ్డింగ్ థీమ్‌గా మార్చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తతో సోషల్ మీడియాలో ఇప్పుడు ‘విరోష్’ నామజపం వినిపిస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

అభిమానుల కోసం వెడ్డింగ్ ఆఫ్ విరోష్:

విజయ్ దేవరకొండ , రష్మిక తమా ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాల ద్వారా అభిమానుల పట్ల తమకున్న ప్రేమనంతటినీ చాటుకున్నారు. "మేము ఏదైనా ప్లాన్ చేసేలోపే మా అభిమానులే ఆ పనులు పూర్తి చేస్తున్నారు.. మా పెళ్లికి కూడా మీరే ‘విరోష్’ అని పేరు పెట్టారు. అందుకే మీ అందరి గౌరవార్థం మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు ఖరారు చేస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.

విరోష్ ప్రీమియర్ లీగ్"

నేడు మళ్ళీ "విరోష్ ప్రీమియర్ లీగ్" అంటూ విజయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునే మీరందరూ మా జీవితంలో ఒక భాగమేనంటూ విజయ్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఇకపోతే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న తమ వివాహానికి హాజరయ్యి సన్నిహితుల కోసం ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయేలా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి

రాజస్థాన్ కోటలో రాయల్ వెడ్డింగ్:

వెండితెరపై ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటి కావడానికి రాజస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక పురాతన కోటలో అత్యంత అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ వేడుకను కేవలం ఫ్యామిలీ ఈవెంట్‌గా ఉంచాలని ఈ జంట నిర్ణయించుకున్నారు. ‘విరోష్’ జంట మూడు ముళ్లతో ఒక్కటి కాబోయే ఆ క్షణం కోసం టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తోంది.

మళ్ళీ తెరపై ‘విరోష్’ సందడి.. ‘రణబాలి’ వచ్చేస్తోంది:

పెళ్లి సందడి ఒకవైపు ఉంటే, ఈ జంట వెండితెరపై కూడా మళ్ళీ మెరవబోతున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’లో విజయ్-రష్మిక జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, పెళ్లి పేరును ఖరారు చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News