లేడీ అభిమానులకు రవ్వదొశెలు పెట్టించిన సొగ్గాడు!
పాత తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీ మోహన్ లాంటి నటులకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉంది.;
పాత తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీ మోహన్ లాంటి నటులకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడంటే? సినిమా అంటే హైదరాబాద్ హబ్ గా మారింది గానీ మద్రాస్ లో సినిమా ఇండస్ట్రీ ఉన్న సమయంలో? తెలుగు నటులు ఎక్కడ నుంచి చెన్నైకి వచ్చారంటే కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లా పేర్లు మాత్రమే వినిపించేవి. అభిమాన సంఘాలు ఎక్కువగా ఎక్కడ ఉండేవి అంటే విజయవాడ నుంచే కనిపించేవి. విజయవాడ నుంచి కృష్ణ అభిమానులుగా ఎంతో మంది అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కి వెళ్లి వివిధ శాఖల్లో స్థిరపడ్డారు.
లేడీ అభిమానులు క్యూ కట్టేవారు:
వారిలో అభిమానం..ఫ్యాషన్ గురించి వారిని అంతే ప్రోత్సహించేవారు కృష్ణ . తాజాగా సొగ్గాడు శోభన్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. తెలుగు నటులంతా మద్రాసులో ఉన్నా? తమ సినిమా రిలీజ్ అవుతుం దంటే? ఆ సినిమా విజయవాడలోనే చూడాలని వచ్చేసేవారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్లు కూడా విజయవాడలో నిర్వహించేవారుట. శోభన్ బాబు కూడా అప్పుడప్పుడు విజయవాడ వచ్చేవారుట. ఆ సమయంలో శోభన్ బాబు దిగిన హోటల్ కి లేడీ అభిమానులు ఎక్కువగా వచ్చేవారుట. వారిని శోభన్ బాబు అంతే ఆప్యాయంగా పలకరించేవారుట.
రెండు రోజుల తర్వాత సమాధానాలు:
వచ్చిన వారందరికీ హోటల్ సిబ్బందితో రవ్వ దోశెలు వేయించి పెట్టించేవారుట. అలాగే శోభన్ బాబు తో ఇంటర్వ్యూ అంటే కాస్త విచిత్రంగానూ ఉంటుందిట. ఆయన్ని ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం వరకే. వాటికి సమాధానాలు మాత్రం వెంటనే చెప్పేవారు కాదుట. అడగాల్సిన ప్రశ్నలన్నింటిని రాసిస్తే వాటికి రెండు రోజుల తర్వాత ఆయన సమాధానాలు రాసిచ్చేవారుట. అందుకు ఓ బలమైన కారణం కూడా ఉందిట. మాట్లాడుతున్న సమయంలో పొరపాటున ఏదైనా ఓ మాట దొర్లితే వివాదాలకు దారి తీస్తుంది? అన్నభయంతో జాగ్రత్తగా ఉండేవారుట. ఆయన కెరీర్ లో ఏనాడు వివాదాలు జోలికి వెళ్లింది లేదన్నారు.
భూమి మీదనే పెట్టుబడి:
ఉన్నంత కాలం సినిమాలు చేయడం..తన పని తాను చేసుకోవడం..అవసరమైతే ఎవరికైనా సలహాలు ఇవ్వడం వంటివి చేసేవారు. ముఖ్యంగా ఆర్దికంగా బలంగా మారాలంటే? ఎన్నో విలువైన సలహాలు ఇవ్వడంలో ఆయన మాస్టర్ అని మురళీ మోహన్ ఓ సందర్భంలో చెప్పారు. సినిమాల్లో సంపాదన దుబారాగా ఖర్చు చేయకుండా భూమీ మీద పెట్టుబడిగా పెట్టమనేవారు. తాను ఆ రకంగానే ఆర్దికంగా బలంగా ఎదిగినట్లు మురళీ మోహన్ చెప్పారు. శోభన్ బాబు సలహాలు విన్నచాలా మంది ఇండస్ట్రీలో ఆర్దికంగా బాగా స్థిరపడినట్లు గుర్తు చేసుకున్నారు.