విజయ్ పై కామెంట్స్.. బండ్లకు ఎస్కేఎన్ కౌంటర్ ఇచ్చారా?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.;
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. పలు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకున్నారు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు బిజినెస్ లతో బిజీగా బిజీగా గడుపుతున్నారు.
అయితే విజయ్ స్టైల్ అండ్ స్వాగ్ సెపరేట్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా స్పెషల్ గా కనిపిస్తుంటారు. యూనిక్ గా ఉంటారు. రీసెంట్ గా ఆయనపై బండ్ల గణేష్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని విజయ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. తాను విజయ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేయలేదని గణేష్ వివరణ ఇచ్చినా అభిమానులు నమ్మలేదు!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఈవెంట్ కు వచ్చిన బండ్ల గణేష్.. కొంతమంది ఒకట్రెండు హిట్లు కొట్టగానే లూసు ఫ్యాంట్లు, కళ్ళజోడు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. వెరైటీ చెప్పులు వేసుకుని వాట్సాప్ అంటూ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తారని అన్నారు. దీంతో విజయ్ టార్గెట్ గా ఆయన మాట్లాడారని అంతా అనుకున్నారు.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండపై ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బండ్ల గణేష్ కు కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ కు విజయ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో ఎస్కేఎన్.. ఆయన కోసం వేదికపై పలు వ్యాఖ్యలు చేశారు.
రాజు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు కానీ ప్రిన్స్ ప్రిన్సే తెలిపారు. సింహం అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహమేనని అన్నారు. తనకు విజయ్ పడే కష్టమేంటో మొత్తం తెలుసని తెలిపారు. ఆయన లైనప్ ద్వారా మరి కొన్ని నెలల్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారని చెప్పుకొచ్చారు.
రెండోసారి కొడితే ఫేక్ అంటారని, మూడోసారి కొడితే దాన్ని ఇండస్ట్రీ షేక్ అంటారని విజయ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన పోస్టర్ వేసి.. టీజర్, ట్రైలర్ వేయకున్నా చాలు ది విజయ్ దేవరకొండ అనే పేరు కనపడితే... ఓపెనింగ్, బాక్సాఫీస్ పగలిపోద్ది అని తెలిపారు. అది విజయ్ దేవరకొండ స్టామినా అంటూ కొనియాడారు. అలా బండ్ల గణేష్ కు ఎస్కేఎన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి బండ్ల ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.