సీనియర్ స్టార్ హీరోయిన్ కి అక్కడ బ్రేక్ వచ్చింది మరి ఇక్కడ..?

కోలీవుడ్ లో రీసెంట్ హిట్ గా నిలిచి స్పెషల్ డిస్కషన్ గా మారిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ.;

Update: 2025-06-05 15:24 GMT

కోలీవుడ్ లో రీసెంట్ హిట్ గా నిలిచి స్పెషల్ డిస్కషన్ గా మారిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. యువ దర్శకుడు అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ సక్సెస్ అవ్వడమే కాదు ఓటీటీలో కూడా అదరగొట్టేస్తుంది. తమిళ నటుడు దర్శకుడు నిర్మాత శశి కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలుగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా థియేట్రికల్ టైం లో తెలుగులో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఓటీటీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ బాగుంది.

ఈ సినిమాతో ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. తెలుగులో కూడా సిమ్రాన్ స్టార్ క్రేజ్ ఏంటన్నది తెలిసిందే. ఐతే హీరోయిన్ గా ఫేడవుట్ అయ్యాక పెద్దగా కనిపించని సిమ్రాన్ కోలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఎప్పుడో 2008లో ఒక్కమగాడు, జాన్ అప్పారావు ఫార్టీ ప్లస్ సినిమాలో నటించిన సిమ్రాన్ మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఐతే అలా అని కెరీర్ ఆపేసిందా అంటే తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది.

తెలుగులోనే ఆమెకు తగిన పాత్రలు రాలేదు అందుకే చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం నచ్చిన సినిమాలు చేస్తూ వచ్చింది. ఐతే రీసెంట్ గా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ తో సిమ్రాన్ సూపర్ కంబ్యాక్ ఇచ్చినట్టు అయ్యింది. ఆమె చేసింది అందులో మిడిల్ ఏజ్ మదర్ రోలే అయినా అందులో కూడా సిమ్రాన్ తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. టూరిస్ట్ ఫ్యామిలీతో సిమ్రాన్ తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అనిపిస్తుంది.

ఐతే సిమ్రాన్ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా చేసింది. దాదాపు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో జత కట్టింది. అలాంటి హీరోయిన్ ని మళ్లీ టాలీవుడ్ లోకి ఎందుకు తీసుకోవట్లేదు అన్నది డిస్కషన్ జరుగుతుంది. ఐతే ఈ ఏజ్ లో తనకు తగిన పాత్రలనే చేస్తా కానీ అనవసరమైన పాత్రలు చేయనని చాలా కచ్చితంగా చెబుతుంది సిమ్రాన్. సో తెలుగులో అలాంటి అవకాశాలు ఎవరు ఇవ్వట్లేదా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సిమ్రాన్ ని మళ్లీ తెలుగు తెర మీద చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎలాగు సీనియర్ స్టార్స్ అంతా మంచి ఫాం లో ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తే బెటర్ అనిపిస్తుంది.

Tags:    

Similar News