ఏ.ఆర్.మురగదాస్ కి చురకలంటించిన సల్మాన్ ఖాన్..దెబ్బ గట్టిగా తగిలిందా?

ఆ సమయంలో డైరెక్టర్ కి నా పక్కటెముక విరిగిపోయిన విషయం తెలియదు. అతను ఈ మధ్య మరో సినిమా రిలీజ్ చేశాడు.;

Update: 2025-10-13 05:42 GMT

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం 'సికందర్'. భారీ బడ్జెట్ తో ఊహించని వీఎఫ్ఎక్స్ విజువల్స్ తో తెరపైకి వచ్చిన ఈ సినిమా.. ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం సల్మాన్ ఖాన్ అంటూ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ తన సినిమా 'మదరాసి' ప్రమోషన్స్ లో ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ గట్టిగా డైరెక్టర్ కి చురకలంటించినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 19కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ కి కమెడియన్ రవిగుప్తా గెస్ట్ గా వచ్చారు. ఈ సమయంలో అతనితో కాసేపు సినిమాల గురించి చర్చించాడు సల్మాన్ ఖాన్. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.." నేను ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేసినందుకు సిగ్గుపడడం లేదు. కొంతమంది సికందర్ సినిమా చేయకుండా ఉండాల్సింది అన్నారు. అయితే నాకు అలా అనిపించలేదు . ఎందుకంటే ఈ సినిమా కథ చాలా బాగుంది. కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్ కి వెళ్లేవాడిని. అందువల్లే సినిమా పోయింది .. ఇది నేను కాదు స్వయంగా డైరెక్టర్ చెప్పిన మాట..

ఆ సమయంలో డైరెక్టర్ కి నా పక్కటెముక విరిగిపోయిన విషయం తెలియదు. అతను ఈ మధ్య మరో సినిమా రిలీజ్ చేశాడు. మరి ఆ హీరో ఉదయం 6 గంటలకే సెట్స్ కి వచ్చేవాడు కదా.. మరి ఆ సినిమా ఎందుకు డిజాస్టర్ గా నిలిచింది?" అంటూ ప్రశ్నించాడు.. అంతటితో ఆగకుండా "సికందర్ మూవీని సాజిద్ నదియాద్వాలా, మురగదాస్ కలిసి చేయాలి. కానీ కొన్ని రోజులకు సాజిత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత మురగదాస్ కూడా వెళ్ళిపోయి.. సౌత్ లో మదరాసి అనే మూవీ చేశాడు. అది సికందర్ కంటే పెద్ద హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. " అంటూ వెటకారంగా డైరెక్టర్ కి ఝలక్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సల్మాన్ ఖాన్ కామెంట్స్ వింటుంటే.. మురగదాస్ సల్మాన్ ను బాగానే హార్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సల్మాన్ ఖాన్ తో సికందర్ మూవీ పరాభవం సాధించిన తర్వాత శివ కార్తికేయన్ తో మదరాసి అనే సినిమా చేశారు మురగదాస్. ఈ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ గురించి మురగదాస్ మాట్లాడుతూ.." సల్మాన్ ఖాన్ రాత్రి 9 గంటలకు సెట్ కి వస్తాడు. షూటింగ్ మొదలుపెట్టే సమయానికి 11 అవుతుంది. ఉదయం చేయాల్సిన సీన్స్ కూడా అర్ధరాత్రి షూట్ చేశాము. ప్రతి చిన్న దానికి గ్రాఫిక్స్ అధికంగా వాడటం వల్ల ఖర్చు పెరిగిపోయింది" అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ మాటలకు కౌంటర్ గా సల్మాన్ ఇప్పుడు ధీటుగా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News