ఆల‌యం సాక్షిగా ప్ర‌భాస్ పెళ్లి గురించి పెద్ద‌మ్మ‌!

ప్ర‌భాస్ పెళ్లి పై నిత్యం మీడియాలో క‌థ‌నాలు స‌హ‌జం. అదిగో పులి..ఇదిగో తోక అన్న‌ట్లు ప్ర‌చారం త‌ప్ప పెళ్లి గురించి అస‌లు సంగ‌తి మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు.;

Update: 2025-08-11 19:30 GMT

ప్ర‌భాస్ పెళ్లి పై నిత్యం మీడియాలో క‌థ‌నాలు స‌హ‌జం. అదిగో పులి..ఇదిగో తోక అన్న‌ట్లు ప్ర‌చారం త‌ప్ప పెళ్లి గురించి అస‌లు సంగ‌తి మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అలాగ‌ని ప్ర‌భాస్ పెళ్లి చేసుకోకుండా ఉండి పోతాడా? అంటే అదీ లేదు. ప్ర‌భాస్ ని అడిగినా...ఆ కుటుంబంలో ఇంకెవ‌రు స్పందించినా పిల్ల కుద‌ర‌డం లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. క‌ళ్యాణ గ‌డియ‌లు వ‌చ్చే వ‌ర‌కూ పిల్ల దొర‌క‌దంటారు. అలా డార్లింగ్ పెళ్లి విష‌యంలో పిల్ల మాత్రం ఓ స‌స్పెన్స్ గా మారింది. మ‌రి ఆ పిల్ల ఎక్క‌డుందా? పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందో? ఆ పెరుమాళ్లే తేల్చాలి.

కానీ ప్ర‌భాస్ పెళ్లిపై క‌థ‌నాలకు మాత్రం పుల్ స్టాప్ ప‌డ‌దు. తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి ఓ ఆల‌యాన్ని సంద‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ త‌న‌యుడి పెళ్లి గురించి స్పందించారు. ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే వివాహం చేసుకుంటార‌ని, త‌మ కుటుంబ‌మంతా ఆ పెళ్లి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. పెళ్లి కూతురు ఎవ‌రు ? అన్న‌ది చెప్ప‌లేదు కానీ పిల్ల కుదిరిన‌ట్లే పెద్దమ్మ స్పందిం చారు. అతి త్వ‌ర‌లోనే పెళ్లి ప్ర‌క‌ట‌న వ‌స్తుంది? అన్న‌ట్లు మాట్లాడారు. వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రు గుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు.

ఆ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు మీడియాను పిలిచి తామే స్వ‌యంగా విష‌యాన్ని వెల్ల‌డిస్తామ‌న్నారు. ప్ర‌భాస్ బ‌హుళ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నా వ్య‌క్తిగ‌త జీవితంలో పెళ్లి అనే అడుగు కోసం అత‌డు స‌మ‌యం కేటా యించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. మొత్తానికి మ‌రోసారి అభిమానుల్ని ఊరించే వార్తే ఇది. ప్ర‌భాస్ పెళ్లి గురించి డార్లింగ్ కంటే ఆయ‌న అభిమానులే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అతి త్వ‌ర‌లోనే ఆ గుడ్ న్యూస్ అభిమానులు వినే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `రాజాసాబ్`, `పౌజీ` సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `రాజాసాబ్` చిత్రీక‌రణ క్లైమాక్స్ కు వ‌చ్చింది. సెప్టెం బ‌ర్ క‌ల్లా` పౌజీ` చిత్రీకర‌ణ పూర్త‌వుతుంది. అనంత‌రం వాటి రిలీజ్ ప‌నుల్లో మేక‌ర్స్ బిజీ అవుతారు. ఈ లోగానే డార్లింగ్ `స్పిరిట్` చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు.

Tags:    

Similar News