తండ్రి సినిమాకు కూతురి సహకారం
థగ్ లైఫ్ సినిమాకు తన వంతు సహకారాన్ని అందిస్తూ శృతి ఆ సినిమాలో విన్వేలి నాయగ అనే సాంగ్ కు తన గొంతును సవరించినట్టు సమాచారం.;
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా శృతి తనదైన సత్తా చాటుతూ ఆడియన్స్ ను అలరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు కుదిరినప్పుడల్లా సింగర్ గా పాటలు పాడుతూ ఉంటుంది శృతి.
ఇప్పుడు శృతి రీసెంట్ గా తన తండ్రి తాజా సినిమా కోసం మరోసారి గొంతు విప్పినట్టు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హాసన్ ఓ పాట పాడినట్టు తెలుస్తోంది. థగ్ లైఫ్ సినిమాకు తన వంతు సహకారాన్ని అందిస్తూ శృతి ఆ సినిమాలో విన్వేలి నాయగ అనే సాంగ్ కు తన గొంతును సవరించినట్టు సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆ పాటను రికార్డు చేశారని, త్వరలోనే పాట అఫీషియల్ గా రిలీజ్ కానుందని అంటున్నారు.
త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి. మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన నాయకన్ సినిమా కంటే ఈ సినిమా బావుంటుందని కమల్ ఇప్పటికే థగ్ లైఫ్ పై ధీమా వ్యక్తం చేయగా, ఈ సినిమా చూశాక కచ్ఛితంగా షాకవుతారని త్రిష చెప్పింది. ఇప్పుడు ఈ సినిమాలో శృతి హాసన్ కూడా పాట పాడిందంటున్నారు. మొత్తానికి జూన్ 5న రిలీజ్ కానున్న థగ్ లైఫ్ లో చాలానే ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి. కమల్ హాసన్, మణిరత్నం కలిసి నిర్మించిన ఈ సినిమా వారికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.