రానా తిప్పలు.. ఫన్నీ పోస్ట్ షేర్ చేసిన శృతి!
ఈ ఆరడుగుల అందగాడు కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు;
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో రానా ఒకరు. అందరికంటే చాలా హైట్ గా ఉంటాడు. ఈ ఆరడుగుల అందగాడు కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. లీడర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా హీరోగా కొన్ని సినిమాలు చేశారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ రానాకి మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తే రానా పాత్ర విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం రానా హీరోగా సినిమాలు చేయటం తగ్గించారు. తెలుగులో చివరగా చేసిన విరాటపర్వం సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సాధించుకుంది కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు.
రానా తిప్పలు
తెలుగు సినిమాని ఇండియా వైడ్ గా ప్రమోట్ చేయాలి అంటే రానా కీలక పాత్ర వహిస్తాడు. చాలా సినిమాలను ప్రమోట్ చేయడంలో ముందుగా ఉంటాడు. బాహుబలి సినిమాతో రానాకి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. దానిలో బల్లాల దేవా అనే పాత్ర విపరీతమైన పేరును తీసుకొచ్చింది.
తాజాగా రానా పడిన తిప్పలను శృతిహాసన్ పోస్ట్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే. మామూలుగా సినీ స్టార్లు — ముఖ్యంగా రానా దగ్గుబాటి లాంటి హీరోలు — బిజినెస్ క్లాస్ లేదా ప్రైవేట్ జెట్‌లో జర్నీ చేస్తారు. కానీ రానా ఓ విమానంలో ఎకానమీ (సాధారణ) సీట్లో కనిపించాడు. ఇది సోషల్ మీడియాలో పెద్దగా ట్రెండ్ అవుతుంది.
శృతిహాసన్ తీసిన ఫోటోలో రానా తన పొడవు కాళ్లను అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే అదే తరహాలో శృతిహాసన్ కూడా ఎకనామి సీట్లలో అడ్జస్ట్ అవ్వడానికి రానా తిప్పలు పడుతున్నారు అంటూ శృతిహాసన్ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత అనే సినిమాను నిర్మించి, నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పలు రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు రానా దగ్గుపాటి. అయితే ఈ సినిమాకి తెలుగులో ఊహించిన స్థాయిలో పాజిటివ్ రివ్యూస్ రావడం లేదు.
గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్
ఇదిలా ఉండగా శృతిహాసన్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్ లో శృతిహాసన్ సంచారి సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాటను మొదట శృతిహాసన్ పాడినప్పుడే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశంసలు వచ్చాయి.