• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఈతా' కోసం 12 కిలోల బరువు...

'ఈతా' కోసం 12 కిలోల బరువు పెరిగిన శ్ర‌ద్ధా.. 8కేజీల గ‌జ్జెలు.. గాయాల‌తోనే!

| విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథతో తెరకెక్కిన ‘ఈతా’ కోసం శ్రద్ధా కపూర్ సుమారు 12 కిలోల బరువు పెరిగి, 8 కిలోల గజ్జెలతో లావణి నృత్య సాధన చేశారు. షూటింగ్‌లో గాయపడి రెండు నెలలు విరామం తీసుకున్న ఆమె, కోలుకున్నాక మళ్లీ బరువు తగ్గారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-28 12:30 GMT

ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోపిక్ చిత్రం `ఈతా` ఇప్పుడు ఆసక్తికర విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలోని తరువాతి దశను తెరపై చూపించే సెకండ్ హాఫ్ సన్నివేశాల కోసం శ్రద్ధా కపూర్ సుమారు 12 కిలోల వరకు బరువు పెరిగినట్లు తాజాగా వెల్లడైంది.

కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ `వెరైటీ ఇండియా`కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షూటింగ్ వివరాలను షేర్ చేసారు. ఈ సినిమాను రివర్స్ పద్ధతిలో అంటే ముందుగా సెకండ్ హాఫ్ సన్నివేశాలు, క్లైమాక్స్ పాటతో చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. బరువు పెరగడం వల్ల డ్యాన్స్ రిహార్సల్స్... స్పీడ్ మూమెంట్స్ సమయంలో శ్రద్ధాపై శారీరక ఒత్తిడి మరింత పెరిగిందని.. కఠినమైన ప్రాక్టీస్ మధ్య ఎంతో శ్రమించారని వైభవీ పేర్కొన్నారు.

అయితే షూటింగ్ సమయంలో శ్రద్ధా గాయపడటంతో చిత్ర బృందానికి సుమారు రెండు నెలల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత సినిమాలోని తొలి భాగం కోసం శ్ర‌ద్ధా తిరిగి బరువు తగ్గే కసరత్తులపై దృష్టి సారించారు. ఇన్ని సవాళ్లు.. శారీరక శ్రమల నడుమ తెరకెక్కిన `ఈతా` డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

ఈతా హైలైట్స్ ఇవే..

ఈ సినిమాలో విఠాబాయి నారాయణగాంకర్ పాత్ర కోసం చిత్రంలో శ్రద్ధా కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రధాన హైలైట్‌. పాత్ర కోసం సుమారు 12 కిలోల బరువు పెరగడమే కాకుండా.. 8 కిలోల గజ్జెలు కట్టుకుని కఠినమైన లావణి నృత్య సాధన చేయడం.. షూటింగ్ సమయంలో గాయపడినా తిరిగి కోలుకుని రివర్స్ షెడ్యూల్‌లో నటించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. అజయ్ -అతుల్ అందించిన జానపద బాణీలు.. వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీ, రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్, దివంగత నానా పటేకర్ వంటి బలమైన తారాగణంతో పాటు 172 నిమిషాల రన్‌టైమ్.. 517 మంది మహిళలతో లావణి స్టెప్పులతో సాధించిన రికార్డులు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

మరోవైపు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గత విజయాలు `ఈతా`కు అతిపెద్ద బలంగా నిలుస్తున్నాయి. లుకా చుప్పి, జరా హట్కే జరా బచ్కే వంటి కమర్షియల్ హిట్లతో పాటు మహిళా ప్రధాన కథనాన్ని భావోద్వేగభరితంగా మలిచి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన `మిమీ`... గతేడాది బ్లాక్‌బస్టర్ అయిన `ఛావా` చిత్రాలతో ఉటేకర్ తన ప్రతిభను నిరూపించుకున్నారు. మరాఠీ సంస్కృతి, గ్రామీణ కళా రూపాలపై ఉన్న లోతైన అవగాహన.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విజువల్ సెన్స్ తోడవడంతో విఠాబాయి జీవితంలోని సంఘర్షణను.. కళా తపనను ఉటేకర్ అత్యంత సహజంగా భారీ స్థాయిలో తెరకెక్కించి ఈ సినిమాకు ప్రధాన ప్లస్‌గా మారారు. `ఈత` కోసం శ్రద్ధా కపూర్ పడ్డ కష్టానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • shraddhakapoor 
  • eethamovie 
  • vithabainarayangaonkar 
  • lavani 

Similar News

ఈ దర్శకులు ఇంకా అవే కథలను పట్టుకుంటున్నారా?

2026-11-28 11:30 GMT

చిరంజీవి అలాంటి కథ కోసం చూస్తున్నాడా?

2026-11-28 10:30 GMT

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

2026-11-28 09:30 GMT

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

2026-11-28 08:07 GMT

నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!

2026-11-28 08:04 GMT

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

2026-11-28 08:03 GMT

కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త క్షమాప‌ణలు.. జానీ మాస్ట‌ర్ కెరీర్ కోస‌మే!

2026-11-28 08:01 GMT

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS