• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రామాయణ'తో రకుల్‌కి కలిసి...

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

| 15 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ప్రస్తుతం నెమ్మదించింది. ‘రామాయణం’లో శూర్పణఖగా నటించి ప్రశంసలు అందుకున్నా కొత్త ఆఫర్లు మాత్రం రాలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఈమె, సౌత్‌ దర్శకులతోనూ సంప్రదింపులు జరుపుతూ టాలీవుడ్‌ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

By - Ramesh Palla
Update: 2026-11-28 05:10 GMT

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు వరుసగా సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు కెరీర్‌లో స్లో అయింది. గత ఏడాది కాలంగా ఆమె సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం ను చూపించడం లేదు. గత ఐదు ఏళ్లుగా బాలీవుడ్‌ సినిమాలతో కెరీర్‌ను నెట్టుకు వస్తున్న విషయం తెల్సిందే. హిందీలో హిట్‌ పడ్డా పడకున్నా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో ఒకటి రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. మెయిన్‌ లీడ్‌ పాత్రలే చేస్తాను అని భీష్మించుకుని కూర్చోకుండా అన్ని రకాల పాత్రలు చేసేందుకు రెడీ అన్నట్లుగా ఈ అమ్మడు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. అందుకే రామాయణంలో చిన్న పాత్ర అయినా ముఖ్య పాత్ర శూర్పణఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. శూర్పణఖ పాత్రలో రకుల్‌ లుక్‌, యాక్టింగ్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది.

రామాయణ ఫిల్మ్‌ ప్రమోషన్‌లో...

రామాయణ సినిమా ప్రమోషన్‌ సమయంలో శూర్పణఖ గురించి పాజిటివ్‌గా మాట్లాడటంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అది కూడా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయి అనేది చాలా మంది మాట. ఆ విషయం పక్కన పెడితే సినిమాలో శూర్పణఖ పాత్రలో నటించినందుకు గాను రకుల్‌ కెరీర్ పరంగా ఏమైనా లాభం పొందిందా అంటే అనుమానమే అన్నట్లుగా సమాధానం వినిపిస్తోంది. శూర్పణఖ పాత్ర గొప్పగా ఉన్నప్పటికీ ఆమెకు ఇప్పటి వరకు కొత్త ఆఫర్లు ఏం రాలేదు. ఇంతకు ముందు కమిట్‌ అయిన ఒకటి రెండు సినిమాల షూటింగ్స్‌ నడుస్తున్నాయి. అవి వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయణ పార్ట్‌ 2 లోనూ ఈమె కొంత సమయం కనిపించే అవకాశం ఉంది. కనుక ఆ సినిమాతో అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.

బాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన విషయం తెల్సిందే. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఆఫర్లు తగ్గాయి. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిన వెంటనే చాలా తెలివిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈమెకు గ్లామర్‌ డాల్‌ పాత్రలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగింది. ఇప్పటికీ బాలీవుడ్‌లో గ్లామర్‌ పాత్రలు చేయడానికి ఈమె రెడీగా ఉంది. అయితే ఆఫర్లు మాత్రం గతంతో పోల్చితే చాలా తగ్గాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తాను అంటే కెరీర్‌లో ముందుకు సాగడం కష్టం. అందుకే రకుల్‌ అటు ఇటుగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను బ్యాలన్స్ చేస్తూ వస్తుంది. శూర్పణఖ పాత్ర చేసి గొప్ప పాత్ర చేశాను, గొప్ప వ్యక్తిగా నటించాను అంటూ రకుల్‌ ప్రచారం చేసుకోవడంను కొందరు సోషల్‌ మీడియాలో తప్పుబట్టిన విషయం తెల్సిందే.

టాలీవుడ్‌ ఆఫర్ల కోసం...

ఇప్పటికే కెరీర్‌ కష్టాల్లో ఉండగా ఇలాంటి వార్తలతో, వివాదాలతో సోషల్‌ మీడియాలో ఉంటే ఆఫర్లు మరింతగా తగ్గుతాయని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పై అయినా రకుల్‌ ఈ విషయమై సైలెంట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామాయణ సినిమాలో భాగస్వామ్యం కావడం వల్ల వెంటనే కాకున్నా వచ్చే ఏడాదిలో అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు రెండు మూడు సినిమాల ఆఫర్లు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ మాత్రం కొత్త ఆఫర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సౌత్‌లో గతంలో వర్క్ చేసిన దర్శకులతోనూ ఈమె టచ్‌లో ఉండి ఆఫర్ల కోసం ఫోన్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరితోనూ మంచి సంబంధాలు ఉన్న రకుల్‌ మళ్లీ సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    
  • rakulpreetsingh 
  • ramayana 
  • shurpanakha 
  • bollywoodnews 

Similar News

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

2026-11-28 05:10 GMT

మెగా 'హను-మాన్‌' సీక్వెల్‌ కొత్త అప్డేట్‌!

2026-11-28 05:10 GMT

'వృశకర్మ' కోసం రామ్‌ చరణ్‌ వచ్చేనా?

2026-11-28 04:31 GMT

మెగా ఫ్యాన్స్‌ సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?

2026-11-28 04:31 GMT

మళ్లీ పెళ్లి మాట ఎత్తిన అల్లు అరవింద్.. ఈసారి ఆ హీరోయిన్ వంతు!

2026-11-28 04:31 GMT

9 ఏళ్లుగా బాహుబ‌లి-2 చెర‌గ‌ని రికార్డ్ .. 'రామాయ‌ణ‌-1' ఎట్ట‌కేల‌కు!

2026-11-28 04:30 GMT

వృషకర్మ Vs అలియాస్ రుక్మిణి... రెండూ చాలా స్పెషల్‌

2026-11-28 04:30 GMT

'హై' మూవీ రివ్యూ

2026-11-28 04:20 GMT

శ‌ర్మా గాళ్ గ్లామ‌ర్ ఎలివేష‌న్ స‌రే .. కెరీర్ సంగ‌తేంటి?

2026-11-28 03:49 GMT

బాలీవుడ్ స్టార్ల‌ను తెలుగు మీడియా ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా?

2026-11-28 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS