'వృశకర్మ' కోసం రామ్ చరణ్ వచ్చేనా?
| నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ‘వృశకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
నాగ చైతన్య హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన 'వృశకర్మ' సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నాగ చైతన్య గత చిత్రం తండేల్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని, వంద కోట్లకు మించి వసూలు చేయడంతో ఈ సినిమాపై అంతకు మించి అనే అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకుడు కార్తీక్ వర్మ దండు సైతం తన గత చిత్రం విరూపాక్షతో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. హీరో, దర్శకుడు ఇద్దరూ గత చిత్రాలతో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో వీరి కాంబో మూవీ కచ్చితంగా వంద కోట్ల మూవీగా నిలుస్తుందని విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంను నిలబెట్టుకునే విధంగానే ట్రైలర్ ఉంది. ఇటీవల విడుదలైన వృశకర్మ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. సుకుమార్ ఈ సినిమాకు ముందు వెనుక ఉన్నట్లుగా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో...
సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు అనే విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఆయన ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంందుకే ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వృశకర్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న బజ్ ను మరింతగా పెంచడం కోసం ప్రముఖ గెస్ట్‌ను తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎలాగూ ఒక నిర్మాత సుకుమార్ కనుక ఆయన ఎవరిని పిలిచినా వస్తారు అనే విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎవరు వస్తారా అనే చర్చ మొదలైంది.
వృశకర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రామ్ చరణ్...
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం రామ్ చరణ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా తీసుకు వచ్చేందుకు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సుకుమార్, రామ్ చరణ్ కలిసి ట్రావెల్ చేస్తున్నారు. వీరి కాంబోలో ఆర్‌సీ17 సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఎలాగూ రామ్ చరణ్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు కనుక తన బ్యానర్‌లో రాబోతున్న సినిమా కనుక వృశకర్మ కోసం రామ్ చరణ్ ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి, సుకుమార్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
నాగ చైతన్య పాత్ర విషయంలో క్లారిటీ...
వృశకర్మ సినిమాలో 5 వేల ఏళ్ల క్రితం నుంచి దాగి ఉన్న ఒక రహస్యం గురించి, పురాతన గుహలో ఉన్న శాసనాలు, వేదిక్ సైన్స్ గురించి చూపించబోతున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర ఏంటీ అనేది క్లీయర్‌గా రివీల్ చేయలేదు. కానీ ఒక పాపకు సంబంధించిన విజువల్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఆ సీన్స్ హర్రర్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను కార్తీక్ వర్మ దండుతో కలిసి సుకుమార్ సైతం రెడీ చేశాడని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 విడుదల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుకుమార్ అందులో కొంత సమయంను ఈ సినిమా కోసం కేటాయించాడని సమాచారం అందుతోంది. సుకుమార్ సాధారణంగా స్క్రిప్ట్ కి సూచనలు చేస్తేనే బెస్ట్ ఔట్ పుట్ వస్తుంది, అదే స్క్రిప్ట్ వర్క్ లో భాగస్వామ్యం అయితే కచ్చితంగా అద్భుతం అవుతుందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కనుక వృశకర్మ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.