ఇంకెన్ని రోజులు ఈ రక్తపాతలు... ప్రేక్షకుడి ఆలోచన మారింది? అలా ట్రై చేయవచ్చు కదా...
| టాలీవుడ్లో రక్తపాతం, భారీ యాక్షన్ సన్నివేశాలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్న దర్శకులకు ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదురవుతోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములాలకు కాలం చెల్లిందని, ఫీల్ గుడ్, రొమాంటిక్, ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టాలని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓటీటీలతో ప్రపంచ సినిమాలను చూస్తున్న ప్రేక్షకులను మెప్పించాలంటే బలమైన కథలతో కొత్త ప్రయోగాలు చేయాల్సిందే.
టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది దర్శకులు రొటీన్ రొట్టా ఫార్ములసినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిజానికి భారీ యాక్షన్ సన్నివేశాలతో రక్తపాతాన్ని క్రియేట్ చేయడమే సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఇంకా అదే భ్రమలో ఉన్నారు కానీ ప్రేక్షకుడి ఆలోచన ధోరణి మారిపోయింది. కొన్ని సినిమాలకు కొద్ది సంవత్సరాల పాటు ఆదరణ దక్కుతుంది. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే చేస్తే ప్రేక్షకులు విమర్శించడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రక్తపాతాలతో సాగే సినిమాల పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఈ సంవత్సరం ఇప్పటికే చాలా సినిమాలు రక్తపాతాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ లను మూట గట్టుకున్నాయి...
ఇప్పటికైనా మారండి...అలాంటి మూవీస్ చేయండి...
తెలుగు ఇండస్ట్రీ లో డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలను చేస్తూ ఈజీగా సక్సెస్ లను సాధించవచ్చు అనే భ్రమలో ముందుకు సాగుతున్నారు. కానీ ఎవరైతే డిఫరెంట్ అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికైనా ఆ విషయాలను తెలుసుకొని ముందుకు సాగితే మంచిది. ఫీల్ గుడ్ మూవీస్, రోమ్ కం సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ప్యూర్ ప్రేమ కథ చిత్రాలను చేయడం మన దర్శకులు పూర్తిగా మానేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో ప్రేమ కథ చిత్రాలను చేస్తే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వారవుతారు. అలా కాకుండా ప్రతి సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న లేకపోయినా ఇరికించి బీభత్సమైన రక్తపాతాన్ని పారిస్తూ హీరో కొన్ని బకెట్ల రక్తాన్ని మీద పోసుకున్నంత మాత్రాన సినిమా సక్సెస్ అయితే సాధించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకులు ముందుకు సాగితే మంచిది ఇక కథల విషయంలో కూడా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
నాసిరకం కథలతో ప్రేక్షకులను మెప్పించొచ్చు అనే భ్రమలో ఉంటే వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. ఓటిటి ల పుణ్యమా అని ప్రేక్షకులు ప్రపంచస్థాయి సినిమాలన్నింటిని చూస్తున్నారు. ఏ సినిమాలు ఎలా చేస్తున్నారు. ఆ మూవీస్ తో మన సినిమాలను పోల్చి చూస్తున్నారు. తద్వారా మన సినిమాల్లో ఏం మిస్ అవుతుందో వాళ్లు ఈజీగా కనిపెట్టి విమర్శలను చేస్తున్నారు..అందుకే ప్రపంచస్థాయి సినిమాలతో పోటీ పడాలంటే గొప్ప కథలతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. అంతే తప్ప రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలే చేస్తాం అంటే దర్శకులు ఫెడౌట్ అయిపోయే ప్రమాదం ఉంది...