• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ స్టార్ల‌ను...

బాలీవుడ్ స్టార్ల‌ను తెలుగు మీడియా ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా?

| సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు 'మాతృభూమి' సినిమా ప్రమోషన్లపైనా దృష్టి సారిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో తెలుగు మీడియా ప్రతినిధులు 'సల్మాన్ భాయ్' అంటూ ఆత్మీయంగా స్వాగతం పలకడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

By - Sivaji Kontham
Update: 2026-11-28 03:49 GMT

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవ‌లి కాలంలో ముంబై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. దిల్ రాజు- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్న స‌ల్మాన్ ఇక్క‌డ షూటింగ్ కోసం రెగ్యుల‌ర్ గా వ‌చ్చి ముంబైకి వెళుతున్నారు. షెడ్యూల్ గ్యాప్స్ లో హిందీ ప్రాజెక్టుల ప్ర‌మోష‌న్స్ పైనా దృష్టి సారిస్తున్నారు. ఓవైపు బార్డ‌ర్ వార్ నేప‌థ్యంలోని `మాతృభూమి` సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్లు.. మ‌రోవైపు వంశీ పైడిప‌ల్లితో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ చేస్తూ రెండు ప‌డ‌వ‌ల‌పైనా ప్ర‌యాణిస్తున్నారు.

సినిమాలు చేయ‌డం ఒకెత్తు అయితే.. వాటికి ప్ర‌చారం చేయ‌డం మ‌రో ఎత్తు. ఇప్పుడు స‌ల్మాన్ కి తెలుగు మీడియాతోను పెద్ద ప‌ని ప‌డింది. దానికి త‌గ్గ‌ట్టే ఇక్క‌డ గ్రాండ్ వెల్ కం ఇప్పుడు చర్చ‌గా మారుతోంది. భాయ్ ఇటీవ‌ల‌ హైద‌రాబాద్ లో అడుగుపెట్టి విమానాశ్ర‌యం నుంచి వెళుతుంటే తెలుగు మీడియా- కెమెరామెన్ల బృందాలు చూపిన ఆప్యాయత, ఉత్సాహం సోషల్ మీడియాలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు ఆయన్ను వెంటాడుతూ ఎంతో ఆత్మీయంగా పిలుస్తూ విజువల్స్ కోసం పోటీ పడటం సల్మాన్ భాయ్ పై ఉన్న అభిమానాన్ని స్పష్టంగా చాటుతోంది.

``సల్మాన్ భాయ్... భాయ్... మాతృభూమి పిక్చర్ కా వెయిట్ హై భాయ్``, ``లవ్ యూ భాయ్... సూపర్ హిట్ భాయ్`` అంటూ ఎంతో అభిమానంతో.. ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఆయన రాకను ఒక పెద్ద ఈవెంట్‌లా కవర్ చేయడం ఘ‌నంగా క‌నిపిస్తోంది. సినీ ప్రమోషన్లు లేదా ఎయిర్‌పోర్ట్ మూమెంట్స్‌లో ఏ బాలీవుడ్ స్టార్ కనిపించినా.. తెలుగు మీడియా ప్రతినిధులు ఇలాంటి పాజిటివ్ వైబ్- ఆదరాభిమానాలతో కవరేజ్ అందించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుగు పరిశ్రమ-మీడియా వర్గాల్లో సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఆదరణ, సాన్నిహిత్యం ఈ దృశ్యాలలో స్పష్టంగా ప్రతిబింబించాయి.

అదే సమయంలో రామ్ చరణ్, బ‌న్ని, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ స్టార్ ల‌ కోసం మీడియా విమానాశ్ర‌యంలో వేచి చూసే తీరు.. వారికి ధీటుగా ఇతర ప‌రిశ్ర‌మ‌ల‌ తారలకు కూడా `గుడ్ లక్ ఫర్ మూవీ`, `నైస్ సాంగ్` అంటూ శుభాకాంక్షలు చెబుతూ తెలుగు మీడియా ఎంక‌రేజ్ చేసే తీరు ఆత్మీయతను మరింత పెంచింది.

మొత్తానికి హైదరాబాద్ వేదికగా సల్మాన్ భాయ్ వెంట పడిన తెలుగు మీడియా తీరు బాలీవుడ్ స్టార్ల‌పై ఇక్కడ ఉన్న అభిమాన ధోరణిని మరోసారి తేటతెల్లం చేసింది. ఇంత‌కుముందు అమితాబ్ బ‌చ్చ‌న్, వివేక్ ఒబెరాయ్, ర‌ణ‌బీర్ కపూర్, ర‌ణ్ వీర్ సింగ్, వ‌రుణ్ ధావ‌న్, ఐశ్వ‌ర్యారాయ్ వంటి వారికి కూడా హైద‌రాబాద్ లో ఇలాంటి గ్రాండ్ వెల్ కం ల‌భించింది.

Tags:    
  • salmankhan 
  • hyderabad 
  • telugumedia 
  • mathrubhumi 
  • vamshipaidipally 

Similar News

శ‌ర్మా గాళ్ గ్లామ‌ర్ ఎలివేష‌న్ స‌రే .. కెరీర్ సంగ‌తేంటి?

2026-11-28 03:49 GMT

కాకా.. ఓ క్లారిటీ వచ్చేసిందిగా..

2026-11-28 03:49 GMT

ఇంకెన్ని రోజులు ఈ రక్తపాతలు... ప్రేక్షకుడి ఆలోచన మారింది? అలా ట్రై చేయవచ్చు కదా...

2026-11-28 03:49 GMT

Bigg Boss Telugu 10: చివరి కెప్టెన్సీ టాస్క్‌లో దెబ్జానీ విజయం!

2026-11-28 03:49 GMT

అఛీవ్ చేయలేకపోయావంటూ నితిన్‌ని నిల‌దీసిన దిల్ రాజు!

2026-11-28 02:41 GMT

టాలీవుడ్‌లో రిలీజ్ పోస్ట్‌పోన్ కల్చర్‌పై బిగ్ డిబేట్

2026-11-28 01:30 GMT

కంగ‌న వ‌ర్సెస్ శ్ర‌ద్దాక‌పూర్ ఎవ‌రు టాప్ లో?

2026-11-28 00:30 GMT

ఆ విష‌యంలో మ‌నోళ్లు ఛాన్స్ ఎందుకు తీసుకోలేదు?

2026-11-27 23:30 GMT

ఆ హీరోతో క‌ళావ‌తి లిప్ లాక్!

2026-11-27 22:30 GMT

హాలీవుడ్ లో తెలుగు న‌టుల‌కు ఛాన్స్!

2026-11-27 19:30 GMT

ప్రభాస్‌కు ఫిట్‌నెస్ టెన్షన్ తగ్గినట్లే!

2026-11-27 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS