• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విష‌యంలో మ‌నోళ్లు...

ఆ విష‌యంలో మ‌నోళ్లు ఛాన్స్ ఎందుకు తీసుకోలేదు?

| ఇతర భాషా దర్శకులు టాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నప్పుడు తమ ప్రాంతానికి చెందిన నటులకు అవకాశాలు ఇస్తున్నా, తెలుగు దర్శకులు పరభాషా చిత్రాల్లో తెలుగు నటులను ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ మొదలైంది. బడ్జెట్, డేట్లు, పారితోషికం, పాత్రల ప్రాధాన్యత వంటి అంశాలు దీనికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలని తెలుగు నటులు కోరుతున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-27 23:30 GMT

ఇండస్ట్రీలో భాషల మ‌ధ్య‌ హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకు, నటులు వేరే ఇండస్ట్రీలకు వెళ్లి సినిమాలు చేయడం సాధారణమైంది. కానీ కాస్టింగ్ విషయంలో మాత్రం ఓ ఆసక్తికర వైరుధ్యం కనిపిస్తోందన్న చర్చ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది. ఇతర భాషా దర్శకులు టాలీవుడ్‌లో సినిమా తీస్తే సొంత‌ ఇండస్ట్రీకి చెందిన నటులకు ఏదో ఒక పాత్ర ఇస్తున్నారు. కానీ తెలుగు దర్శకులు పరభాషల్లో పని చేసినప్పుడు మాత్రం తెలుగు నటులను ఎందుకు? తీసుకోవడం లేదనే ప్రశ్న తెరపైకి వ‌స్తోంది.

ఇతర భాషల నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్న దర్శకుల తీరును గమనిస్తే కథలో చిన్న పాత్ర అయినా? తమ ప్రాంతానికి చెందిన నటులను భాగం చేస్తున్నారు. దీంతో తమ భాషా ప్రేక్షకులకు ఆ సినిమాతో కనెక్ట్ ఏర్పడుతుందని..మార్కెటింగ్ పరంగానూ కొంత వ‌ర‌కూ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పైగా పరిచ యమున్న ఆర్టిస్టులతో పనిచేయడం వల్ల సెట్స్‌లో కంఫర్ట్ లెవెల్ కూడా ఉంటుందని నమ్ముతున్నారు.

మరి తెలుగు దర్శకులు వేరే భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్న‌ప్పుడు ఈ ధోరణి ఎందుకు కనిపించడం లేదన్నది ఆసక్తికరం. అక్కడ కథ.. నిర్మాణ సంస్థల డిమాండ్లు.. ఆయా మార్కెట్లలోని స్టార్ల ఇమేజ్‌లకు తగ్గట్టుగా కాస్టింగ్ సెట్ చేయాల్సిన పరిస్థితులుంటాయి. చాలా సందర్భాల్లో కొత్త భాష, టీమ్, బడ్జెట్ లెక్కల మధ్య తెలుగు దర్శకులు కాస్టింగ్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారనే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

దీంతో పాటు బడ్జెట్.. డేట్ల సర్దుబాటు వంటి ప్రాక్టికల్ అంశాలు కూడా పాత్ర పోషిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. పరభాషా సినిమాల్లో నటించేందుకు తెలుగు నటుల డేట్లు కుదరకపోవడం.. పారితోషికం.. పాత్ర ప్రాధాన్యత విషయంలో సయోధ్య కుదరకపోవడం వంటి కారణాలు కూడా ఉండొచ్చు. పేరు కోసం చిన్న పాత్ర ఇస్తే నటుడి ఇమేజ్‌కే ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన కూడా దర్శకుల్లో ఉండొచ్చు.

అయితే పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్న నేప‌థ్యంలో పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఏ భాషలో సినిమా చేసినా? ఆ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదలవుతోంది . ఈ నేప‌థ్యంలో కథకు తగ్గట్టుగా వేరే భాషల నటులను తీసుకోవడం పెరిగింది. భ‌విష్య‌త్ లో తెలుగు దర్శకులు కూడా పరభాషా ప్రాజెక్టుల్లో తెలుగు నటులకు తగిన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తే మరింత మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఆ దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ప‌లువురు తెలుగు ఆర్టిస్టులు కోరుతున్నారు.

Tags:    
  • telugucinema 
  • tollywood 
  • teluguactors 
  • telugudirectors 
  • panindiacinema 

Similar News

ఆ హీరోతో క‌ళావ‌తి లిప్ లాక్!

2026-11-27 22:30 GMT

హాలీవుడ్ లో తెలుగు న‌టుల‌కు ఛాన్స్!

2026-11-27 19:30 GMT

ప్రభాస్‌కు ఫిట్‌నెస్ టెన్షన్ తగ్గినట్లే!

2026-11-27 18:30 GMT

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

2026-11-27 17:30 GMT

ఉద్యోగులే రీప్లేస్ చేస్కుంటున్నారు.. AI పై ఆర్జీవీ

2026-11-27 17:14 GMT

హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్!

2026-11-27 17:13 GMT

మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్ అయ్యాక ఈ న‌టితో నిండా మునిగాడు!

2026-11-27 17:13 GMT

కమర్షియల్ లెక్కలు లేకుండానే 'అలియాస్ రుక్మిణి': దీప్తి గంటా

2026-11-27 17:13 GMT

టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?

2026-11-27 17:13 GMT

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

2026-11-27 17:12 GMT

తెలుగు టైగర్స్‌కు రీమేక్ ప్లాన్.. క్లిక్కయ్యేనా?

2026-11-27 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS