• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉద్యోగులే రీప్లేస్...

ఉద్యోగులే రీప్లేస్ చేస్కుంటున్నారు.. AI పై ఆర్జీవీ

| AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులే రహస్యంగా AIని ఉపయోగించుకుంటూ, ఆ పనిని తమ ప్రతిభగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. AIని బహిరంగంగా అంగీకరించి వినియోగించాలని సూచించారు. భవిష్యత్తులో AIని ఉపయోగించేవారే ఉపయోగించని వారి స్థానాలను భర్తీ చేస్తారని అభిప్రాయపడ్డారు.

By - Sivaji Kontham
Update: 2026-11-27 17:14 GMT

కృత్రిమ మేధస్సు (AI) రాకతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని, AI తమ ఉపాధిని లాగేసుకుంటోందని పలు రంగాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విశ్లేషణ చేశారు. `ది AI ట్రూత్ బాంబ్` అనే శీర్షికతో ఆయన పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద కలకలం రేపుతోంది. నిజానికి AIని ఉపయోగించుకుని ఉద్యోగులే లాభపడుతున్నారని.. చాలా మంది తమ ఉద్యోగ విధుల కోసం AIని రహస్యంగా వాడుకుంటూ.. ఆ పనంతా తామే చేస్తున్నట్లు బాస్ దగ్గర కలరింగ్ ఇస్తూ దొంగ నాటకాలాడేస్తున్నారని వర్మ ఘాటుగా విమర్శించారు.

`ది AI ట్రూత్ బాంబ్` పేరుతో ఆర్జీవీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆఫీసుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఏఐని అంగీక‌రించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని.. ఆఫీసుల్లో నిఘా కెమెరాలు దండ‌గ అని కూడా తేల్చేసారు ఆర్జీవీ. ఏఐని బహిరంగంగా, దూకుడుగా, ఎలాంటి అపరాధభావం లేకుండా ఉపయోగించడమే అసలైన మార్గమని రామ్ గోపాల్ వర్మ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏం జరిగినా ఒక చేదు నిజం మాత్రం ఖాయమని.. AIని ఉపయోగించే వారు.. AIని ఉపయోగించని వారి స్థానాన్ని భర్తీ చేయడం తథ్యమని ఆర్జీవీ త‌న పోస్ట్ లో రాసారు.

తమను AIతో తమంతట తామే రీప్లేస్ చేసుకుంటున్నారనే చేదు నిజాన్ని ఆర్జీవీ వివరంగా విశ్లేషించారు. కోడింగ్ రాసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్లాడ్లో ప్రాంప్ట్ వేసి నిమిషాల్లో ఫంక్షన్ తీసుకుని తన పేరుతో పుష్ చేస్తున్నాడని... క్యాంపెయిన్ ఐడియాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చాట్‌జీపీటీ వాడి మీటింగ్‌లో తన సొంత ఆలోచనగా చెప్పుకుంటున్నాడని వర్మ ఉదాహరణలు చూపారు. అలాగే డేటా అనలిస్టులు, డిజైనర్లు (మిడ్‌జర్నీ వంటి టూల్స్‌తో), కస్టమర్ సపోర్ట్ లీడ్స్ కూడా తలుపులు మూసుకుని... బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేస్తూ రహస్యంగా AI సాయంతో పని పూర్తి చేసి తమ సొంత ప్రతిభేనని నటిస్తున్నారని పేర్కొన్నారు.

ఆఫీసుల్లో నిఘా కెమెరాలు లేదా గూఢచారులు పెట్టడం దండగ అని... కేవలం లెక్కలు, అవుట్‌పుట్ చూస్తే సంస్థలకు అసలు విషయం ఇట్టే అర్థమవుతుందని వర్మ క్లారిటీగా చెప్పారు. AI 24/7 పనిచేస్తుందని.. కాఫీ బ్రేకులు తీసుకోదని.. జ‌బ్బు పడదని.. జీతాలు లేదా ప్రమోషన్లు అడగదని... అందుకే అవుట్‌పుట్ పెరిగి... డెడ్‌లైన్లు వేగంగా పూర్తవుతూ కంపెనీలకు లాభాలు వస్తున్నాయని వివరించారు. తీరా లేఆఫ్‌లు వచ్చినప్పుడు మాత్రం కంపెనీలను, టెక్నాలజీని నిందిస్తారని... కానీ నిజానికి ఉద్యోగులే రహస్యంగా తమ స్థానాన్ని AIతో భర్తీ చేసుకుని జీతాలు తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఏఐని బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం వచ్చిందని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. దొంగ చాటు వ్య‌వ‌హారాలేవీ వ‌ద్దు.. బ‌హిరంగంగానే దానిని అంగీక‌రించి దాని స‌హ‌కారంతో ముందుకు సాగుతూ ఉద్యోగులు, కంపెనీలు కూడా మ‌రింత ఉత్త‌మంగా బాట‌లు వేసుకోవాల‌ని సూచించారు.

Tags:    
  • ramgopalvarma 
  • rgv 
  • artificialintelligence 
  • aiandjobs 
  • aitechnology 

Similar News

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

2026-11-27 17:30 GMT

హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్!

2026-11-27 17:13 GMT

మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్ అయ్యాక ఈ న‌టితో నిండా మునిగాడు!

2026-11-27 17:13 GMT

కమర్షియల్ లెక్కలు లేకుండానే 'అలియాస్ రుక్మిణి': దీప్తి గంటా

2026-11-27 17:13 GMT

టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?

2026-11-27 17:13 GMT

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

2026-11-27 17:12 GMT

తెలుగు టైగర్స్‌కు రీమేక్ ప్లాన్.. క్లిక్కయ్యేనా?

2026-11-27 16:30 GMT

డాక్యుమెంటరీని ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్‌ కి సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కోర్టు నోటీసులు

2026-11-27 15:30 GMT

ఆ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారా?

2026-11-27 14:30 GMT

కేవలం 55రోజుల్లోలో ముగించేసే పెద్ద హీరో.. వింటున్నారా టాలీవుడ్ టాప్‌ హీరోలు?

2026-11-27 13:30 GMT

మెగాస్టార్ క్లాసిక్ టైటిల్ తో యంగ్ హీరో.. వెరైటీగా 'రుస్తుం' గ్లింప్స్

2026-11-27 12:46 GMT

Copyright @2026

Powered by Blink CMS