మెగాస్టార్ క్లాసిక్ టైటిల్ తో యంగ్ హీరో.. వెరైటీగా 'రుస్తుం' గ్లింప్స్
| యంగ్ హీరో విరాట్ నటిస్తున్న ‘రుస్తుం’ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రెనితార్ సిటీ అనే కల్పిత నగరం, గ్యాంగ్ వార్ వాతావరణాన్ని ఆసక్తికరంగా చూపించారు. కనిష్క గంధం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని కొట్టిన పవర్ ఫుల్ టైటిల్ 'రుస్తుం'. ఇప్పుడు అదే టైటిల్ తో యంగ్ హీరో విరాట్ తన కొత్త సినిమాను మొదలుపెట్టారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ లేటెస్ట్ గా 'రుస్తుం' టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. రొటీన్ యాక్షన్ టీజర్ల లాగా హీరో ఇంట్రడక్షన్ షాట్స్ తో కాకుండా, పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ వీడియోను కట్ చేశారు.
సుమారు నిమిషంన్నర నిడివి ఉన్న ఈ గ్లింప్స్ చూస్తుంటే ఏదో వీడియో గేమ్ లేదా గ్రాఫిక్ నావెల్ లోకి వెళ్లిన ఫీల్ కలుగుతోంది. ఎర్రటి ఆకాశం కింద 'రెనితార్ సిటీ' అనే ఒక ఫిక్షనల్ ఐలాండ్ నగరాన్ని ఇందులో చూపించారు. ట్రినిటీ పోర్ట్, ధోబీ ఘాట్, మున్సిపల్ కబేళా, మిమి ల్యాబ్, దర్వాజా బస్తీ, కాసాబ్లాంకా లాంటి ఏరియాల మీదుగా కెమెరా దూసుకెళ్తూ ఆ నగరంలోని చీకటి కోణాలను, అక్కడి గ్యాంగ్ వార్ వాతావరణాన్ని ఒక్కో ఫ్రేమ్ లో చూపించారు.
చివర్లో 'అగ్నిగిరి' కొండపైన ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం, దాని కింద వేలమంది శత్రువుల ముందు ఒంటరిగా నిలబడిన హీరో బ్యాక్ షాట్ గ్లింప్స్ లో మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఒకే నగరం, ఒక్కడే మనిషి, వేలమంది శత్రువులు అంటూ వచ్చే డైలాగ్, దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వీడియోకు మంచి ఇంటెన్స్ టెంపోను ఇచ్చాయి. అయితే విరాట్ ఫేస్ రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించారు.
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో కనిష్క గంధం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫైట్స్ మాత్రమే కాకుండా బలమైన కథ, ఎమోషన్స్ కూడా ఇందులో ఉంటాయని టీమ్ చెబుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీరి గత సినిమాల తరహాలోనే ఇందులోనూ విజువల్ క్వాలిటీ, టెక్నికల్ ప్రజెంటేషన్ మీద గట్టిగానే ఖర్చు పెడుతున్నట్లు ఈ గ్లింప్స్ చెబుతోంది.
ప్రస్తుతానికి టైటిల్, కాన్సెప్ట్ వరల్డ్ ను మాత్రమే మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో విరాట్ సరసన నటించే హీరోయిన్ ఎవరు, ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలాగే సంగీత దర్శకుడు, ఇతర టెక్నీషియన్ల పేర్లను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. యంగ్ హీరో సినిమాకు 'రుస్తుం' లాంటి బరువైన టైటిల్ పెట్టడం, దానికి తగ్గట్టు ఒక డార్క్ యాక్షన్ వరల్డ్ ను క్రియేట్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక నెక్ట్స్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.