• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్...

గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ ఇలా అయ్యాడేంటో..!

| 52 ఏళ్ల హృతిక్ రోషన్ తాజా వీడియోలో కనిపించిన లుక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మేకప్, వీడియో ఫిల్టర్లతో వయసు ఛాయలను దాచే ప్రయత్నం చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సహజమైన లుక్‌లో కనిపించినా తమ అభిమానం తగ్గదని, వయసుతో వచ్చే మార్పులను స్వీకరించాలని సూచిస్తున్నారు. క్రిష్ ఫ్రాంచైజీ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By - Ramesh Palla
Update: 2026-11-27 09:30 GMT

బాలీవుడ్‌ హీరోల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో ఎవరు అంటే హృతిక్‌ రోషన్‌ పేరు వెంటనే వినిపిస్తుంది. దాదాపు పాతిక ఏళ్లుగా హృతిక్‌ రోషన్‌ లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే హృతిక్‌ రోషన్‌కి ఏకంగా గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదు వచ్చింది. గ్రీక్ వీరుడు అని హృతిక్‌ రోషన్‌ను చూస్తే అనిపిస్తుందని అభిమానులు అంటూ ఉంటారు. ఆయన కండలు తిరిగిన శరీరం, ఆయన ఫిజిక్‌, ఆయన కళ్లు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి దానికి అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే హృతిక్‌ రోషన్‌ వరుసగా ఫ్లాప్స్ చవిచూసినా, అసలు సినిమాలు చేయకున్నా అభిమానులు మాత్రం తగ్గలేదు. ఆయన్ను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉన్నారు. అయితే హృతిక్‌ రోషన్‌ తాజాగా కనిపించిన తీరును ఆయన ఫ్యాన్స్ కూడా తప్పుబడుతున్నారు.

హృతిక్‌ రోషన్‌ లుక్‌ పై విమర్శలు...

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వయసు మీద పడుతున్న సమయంలో మొహంలో ఉండే ఛార్మింగ్‌ తగ్గకుండా ఉండదు. దాన్ని సహజంగానే జనాలకు చూపించడం మంచిది. అలా కాదని, ఆ వయసు తాలూకు ముడతలు కనిపించకుండా ప్రయత్నించడం అనేది అవివేకం అవుతుంది. సినిమాల్లో అయితే పర్వాలేదు కానీ నిజ జీవితంలో కూడా ఆ ముడతలు చూపించకుండా ఉండాలి అనుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. కానీ హృతిక్‌ రోషన్‌ మాత్రం తన వయసు తాలూకు గుర్తులను దాచే ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయిదు పదుల వయసు దాటిన కారణంగా ఎవరికి అయినా మొహం పై ముడతలు రావడం సహాయం. వాటిని సహజ సిద్దంగా చూపిస్తే ఎక్కువ తేడాగా అనిపించదు. కానీ వాటిని కనిపించకుండా చేయాలని చూస్తే మాత్రం మరింత ఎబెట్టు గా మారే ప్రమాదం ఉందని మరోసారి నిరూపితం అయ్యింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో వీడియో...

తాజాగా హృతిక్‌ రోషన్‌ ఒక కార్యక్రమంలో హాజరు కాబోతున్నాను అంటూ వీడియో బైట్ ఇచ్చాడు. ఆ వీడియో బైట్‌ లో హృతిక్‌ రోషన్‌ లుక్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. హృతిక్ వయసు 52 కావడంతో ఆయన మొహం పై సహజ సిద్దంగా ముడతలు ఏర్పడటం కామన్‌, కానీ వాటిని ఆయన దాయాల్సిన అవసరం ఏంటో అంటూ ప్రశ్నిస్తున్నారు. మేకప్‌తో పాటు, కాస్త వీడియోను ఫిల్టర్స్‌ తో విడుదల చేయడం ద్వారా హృతిక్‌ నేచురల్‌ లుక్‌ పోయిందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని, ఇలాంటివి హృతిక్ లాంటి పెద్ద స్టార్‌ చేయడం అనేది కరెక్ట్‌ కాదని అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోలు షేర్‌ చేస్తు అంటున్నారు. హృతిక్‌ ను తాము నేచురల్‌ లుక్‌ లో చూడాలి అనుకుంటున్నాం. కాలంతో పాటు వచ్చి మార్పులను స్వీకరించి కూడా హృతిక్‌ ను అభిమానిస్తామని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.

గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ న్యూ లుక్‌...

ఈ గ్రీక్ వీరుడు బాక్సాఫీస్ వద్ద హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. అయినా కూడా పట్టింపు లేకుండా ఇలా మేకప్‌ వేసుకుని, ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కావడం, పబ్లిసిటీ కార్యక్రమాలు చేయడం, అవార్డ్‌ ఫంక్షన్స్‌ కు హాజరు కావడం ఏంటో అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ గతంతో పోల్చితే సినిమాల విషయంలో సీరియస్‌గా ఉండటం లేదేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు, ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు, ఆయన దర్శకులు చాలా నిరుత్సాహ పరుస్తున్న విషయం తెల్సిందే. క్రిష్ ప్రాంచైజీ మూవీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆయన నుంచి రావడం లేదు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మంచి సినిమాలను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
  • hrithikroshan 
  • greekgodofbollywood 
  • bollywood 
  • hrithikroshanfans 

Similar News

ఆ సూపర్ హిట్ సీక్వెల్‌కి రిలీజ్ తిప్పలు తప్పవా?

2026-11-27 09:30 GMT

27 దేశాల్లో రికార్డ్..రామాయణం విశ్వవ్యాప్త కలెక్షన్లు!

2026-11-27 09:30 GMT

బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో మెరిసిన సోనాల్ చౌహాన్..

2026-11-27 09:30 GMT

హిట్ మ్యాన్ మ‌న‌సులో సూప‌ర్ స్టార్లు వీళ్లే!

2026-11-27 08:30 GMT

హై-వోల్టేజ్ సినిమాలపై ప్రేక్షకుల్లో విసుగు!

2026-11-27 07:57 GMT

ఇతడి పేరు వింటేనే బాలీవుడ్ గుండెల్లో గుబులు పుడుతోందట!

2026-11-27 07:30 GMT

నితిన్ ఈ సారి కొట్టేలా ఉన్నాడు, కారణం ఇదే

2026-11-27 07:15 GMT

జూబ్లీహిల్స్ లో ఇల్లు అమ్మేసి విదేశాల‌కు అనుష్క!

2026-11-27 06:41 GMT

'భోగి' మూవీ రివ్యూ

2026-11-27 06:37 GMT

ఈNఈ కి సీక్వెల్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది

2026-11-27 06:37 GMT

సూర్యాస్తమయ వేళ ప్రకృతి ఒడిలో కయాదు లోహర్ సందడి!

2026-11-27 05:42 GMT

Copyright @2026

Powered by Blink CMS