• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూబ్లీహిల్స్ లో ఇల్లు...

జూబ్లీహిల్స్ లో ఇల్లు అమ్మేసి విదేశాల‌కు అనుష్క!

| హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న విలాసవంతమైన ఇంటిని అనుష్క రూ.12 కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళూరుకు లేదా విదేశాలకు షిఫ్ట్ అవుతున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే కొత్త నివాసం కోసమే పాత ఇంటిని విక్రయించినట్లు మరో టాక్. సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారనే వార్తలను సన్నిహితులు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘కథనార్’లో నటిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-27 06:41 GMT

స్వీటీ అనుష్క టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌మ‌ర్శియ‌ల్ పాత్ర‌ల‌తో పాటు లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గానూ అమ్మ‌డు ఓ వెలుగు వెలిగింది. బాహుబలి తర్వాత సినిమాల వేగం తగ్గించినా? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ లాంటి చిత్రాలతో తన మార్క్ చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ తనదైన శైలిలో స‌త్తా చాటే ప్ర‌య‌త్నంచేస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న విలాసవంతమైన ఇంటిని అనుష్క అమ్మేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

12 కోట్ల విలువైన ప్రాపర్టీ చేతులు మారడంతో ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్న అనుష్క సడెన్‌గా ఇల్లు అమ్మేయడం వెనుక కారణమేంటని ఆరా తీస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అనుష్క హైదరాబాద్ వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారని కొందరు అంటుంటే.. కాదు సొంతూరు మంగళూరుకు షిఫ్ట్ అవుతున్నారని మరికొందరు చెబుతున్నారు.

పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యేందుకే ఇలా ఆస్తులు అమ్మేస్తున్నారనే రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక అవసరాల కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి స్వీటీకి లేదంటున్నారు. కేవలం నివాస ఏర్పాట్లను మార్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి అనుష్కకు జూబ్లీహిల్స్ ఇంటితో పాటు హైదరాబాద్ శివార్లలో పెద్ద ఫామ్‌హౌస్ కూడా ఉంది. సిటీలోని మరో ఏరియాలో కొత్త ఇల్లు తీసుకునే ప్లాన్‌లో భాగంగానే పాత ఇంటిని అమ్మేశారనే టాక్ కూడా వినిపిస్తోంది.

గత కొన్నేళ్లుగా ఈవెంట్లకు.. మీడియాకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఇంటి అమ్మకం వార్తలపై ఆమె గానీ ..టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ వార్తలతో పాటు అనుష్క సినిమాలకు గుడ్‌బై చెబుతున్నార‌నే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

స్వీటీ ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నారు. జయసూర్య హీరోగా న‌టిస్తోన్న‌ మూవీతో అనుష్క‌ మాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పాటు ఎన్నో హిట్స్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్న నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్లి సినిమాలకు దూరమవుతారనే వార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.

Tags:    
  • anushkashetty 
  • sweety 
  • tollywood 
  • kathanar 

Similar News

'భోగి' మూవీ రివ్యూ

2026-11-27 06:37 GMT

ఈNఈ కి సీక్వెల్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది

2026-11-27 06:37 GMT

సూర్యాస్తమయ వేళ ప్రకృతి ఒడిలో కయాదు లోహర్ సందడి!

2026-11-27 05:42 GMT

'నాన్న కుట్టి' మూవీ రివ్యూ

2026-11-27 05:37 GMT

అలాంటి బన్నీ మళ్లీ ఎప్పటికో..

2026-11-27 05:22 GMT

హిట్ డైరెక్టర్లకు.. ఈ హీరో కనిపించడం లేదా?

2026-11-27 05:21 GMT

మైత్రి వాళ్ళు ఏ ఒక్కరినీ వదలట్లేదుగా.. !

2026-11-27 04:58 GMT

జగ్గూభాయ్ లో ఊహించని కోణం.. నిజంగా గ్రేట్ సార్..

2026-11-27 04:58 GMT

సుకుమార్ వంటి దర్శకుడు ఇలా చేస్తే ఎలా?

2026-11-27 04:45 GMT

48 రోజుల్లోనే `అలియాస్ రుక్మిణి`.. తక్కువ రోజుల్లో తెరకెక్కిన సినిమాలివే!

2026-11-27 04:02 GMT

వీకెండ్ జాత‌ర‌: ఆదర్శ కుటుంబం- గరివిడి లక్ష్మి ఓటీటీలో

2026-11-27 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS