• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మైత్రి వాళ్ళు ఏ ఒక్కరినీ...

మైత్రి వాళ్ళు ఏ ఒక్కరినీ వదలట్లేదుగా.. !

| ప్రతిభావంతులైన దర్శకులకు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి మైత్రి మూవీ మేకర్స్‌ బుక్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్‌ నీల్‌, లోకేష్‌ కనగరాజ్‌, చిదంబరం, జీతూ మాధవన్‌, సిబి చక్రవర్తి, నెల్సన్‌, వెట్రిమారన్‌ వంటి దర్శకులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో సినిమాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

By - Ramesh Palla
Update: 2026-11-27 04:58 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థల జాబితాలో మైత్రి మూవీ మేకర్స్ ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. మైత్రి వారు నిర్మించిన సినిమాలు ఏడాదికి కనీసం రెండు మూడు అయినా విడుదల అవుతున్నాయి. ఒకవైపు భారీ బడ్జెట్‌ సినిమాలు, వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు, చిన్న సినిమాలు కంటెంట్‌ ఓరియంట్‌ సినిమాలను మైత్రి వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఏ భాషలో అయినా ఒక దర్శకుడు హిట్ కొడితే వెంటనే ఆ దర్శకుడికి అడ్వాన్స్ ఇస్తున్నారు అనే టాక్‌ ఉంది. తెలుగు నిర్మాణ సంస్థల్లో ఎక్కువగా ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసిన నిర్మాతలుగా మైత్రి వారు నిలిచారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకు రావడమే లక్ష్యంగా మైత్రి వారు కొత్త వారికి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి లాక్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ డ్రాగన్‌...

కన్నడ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు చాలా ఏళ్ల క్రితం మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో సినిమాను నిర్మిస్తున్నారు. చాలా మంది దర్శకులకు ఏళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి వారు మెల్ల మెల్లగా వారితో సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఇలా మైత్రి వారు బ్లాక్‌ చేసిన దర్శకుల జాబితా తీస్తే చాలా పెద్దగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. తాజాగా సూర్య హీరోగా నటించి సూపర్‌ హిట్‌గా నిలిచిన సీన్‌ మూవీ దర్శకుడు జీతూ మాధవన్‌ కి మైత్రి వారు అడ్వాన్స్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. సీన్ కాకుండా ఇంతకు ముందు జీతూ మాధవన్‌ భారీ విజయాలను సొంతం చేసుకుంది లేదు, కానీ ఆయన ప్రతిభావంతుడు అనే అభిప్రాయం ఉంది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ వారు ఆయనకు అడ్వాన్స్‌ ఇచ్చి, వచ్చే ఏడాది సినిమాను చేసేందుకు ఒప్పించారని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భారీ సినిమా....

మైత్రి మూవీ మేకర్స్‌ వారు ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా 'డ్రాగన్‌' మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రెండు పార్ట్‌లుగా డ్రాగన్‌ మూవీ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలోనూ మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను నిర్మించబోతున్నారు. నాలుగు ఏళ్ల క్రితం లోకేష్ కనగరాజ్‌కి అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్‌ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మొదలు పెట్టబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళ దర్శకుడు చిదంబరం కి సైతం మైత్రి వారు అడ్వాన్స్‌ ఇవ్వడం జరిగిందట. మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమాతో చిదంబరం దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. దాంతో వెంటనే మైత్రి వారు ఆయనకు అడ్వాన్స్‌ ఇచ్చారు.

నానితో సినిమాకు మైత్రి ఏర్పాట్లు...

తమిళ దర్శకుడు సిబి చక్రవర్తికి మైత్రి వారు అడ్వాన్స్ ఇచ్చారు. నానితో మైత్రి వారు చేయబోతున్న సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయలాన్‌ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న తమిళ దర్శకుడు ఆర్‌ రవికుమార్‌ కి సైతం మైత్రి వారు అడ్వాన్స్ చెక్‌ ఇవ్వడం జరిగిందట. ఈయనతో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ్‌ క్రేజీ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న విశాల్‌ వెంకట్‌ కి సైతం మైత్రి వారు అడ్వాన్స్ ఇచ్చి బుక్‌ చేశారట. అజిత్‌తో ఇప్పటికే మైత్రి వారు గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాను నిర్మించారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్‌ రవిచంద్రన్‌ తో మరో సినిమా కోసం మైత్రి వారు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట. వీళ్లు కాకుండా ప్రదీప్ రంగనాథ్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, వెట్రిమారన్‌ వంటి దర్శకులకు సైతం మైత్రి వారు అడ్వాన్స్ ఇచ్చి ఉంచారని సమాచారం. ప్రతిభను కనిపెట్టి అడ్వాన్స్‌లు ఇచ్చుకుంటూ వెళ్తున్న మైత్రి వారు ఈ సినిమాలన్నింటిని ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి.

Tags:    
  • mythrimoviemakers 
  • prashanthneel 
  • lokeskanagaraj 
  • jeethumadhavan 
  • chandambaram 

Similar News

జగ్గూభాయ్ లో ఊహించని కోణం.. నిజంగా గ్రేట్ సార్..

2026-11-27 04:58 GMT

సుకుమార్ వంటి దర్శకుడు ఇలా చేస్తే ఎలా?

2026-11-27 04:45 GMT

48 రోజుల్లోనే `అలియాస్ రుక్మిణి`.. తక్కువ రోజుల్లో తెరకెక్కిన సినిమాలివే!

2026-11-27 04:02 GMT

వీకెండ్ జాత‌ర‌: ఆదర్శ కుటుంబం- గరివిడి లక్ష్మి ఓటీటీలో

2026-11-27 04:02 GMT

'కింగ్‌'ను సైలెంట్‌గా ఉండ‌మ‌న్న‌ అంబానీ? లీగ‌ల్ నోటీస్ క‌ల‌కలం!

2026-11-27 04:01 GMT

భార్య‌తో అక్కినేని చియాన్ జ‌పాన్ ట్రిప్ వెన‌క అసలు కారణమిదే!

2026-11-27 04:01 GMT

నంది అవార్డుల క‌మిటీ ఛైర్మ‌న్‌గా NBK .. కొత్త ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి!

2026-11-27 04:01 GMT

తెలుగు సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి.. పొగ‌డ్త కాదు బ‌రువు!

2026-11-27 04:00 GMT

Bigg Boss Telugu 10: మాజీ విన్నర్ల సందడితో హౌస్‌లో కొత్త జోష్

2026-11-27 03:59 GMT

ధనుష్ సినిమా.. మళ్ళీ అదే వరస

2026-11-27 03:58 GMT

'ENE Repeat' క్లీన్ హిట్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్!

2026-11-27 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS