• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  48 రోజుల్లోనే `అలియాస్...

48 రోజుల్లోనే `అలియాస్ రుక్మిణి`.. తక్కువ రోజుల్లో తెరకెక్కిన సినిమాలివే!

| నితిన్ హీరోగా నటిస్తున్న 'అలియాస్ రుక్మిణి' షూటింగ్‌ను కేవలం 48 రోజుల్లోనే పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ పూర్తి స్క్రిప్ట్, పక్కా ప్రీ ప్రొడక్షన్‌తో సిద్ధంగా రావడంతో ఎలాంటి జాప్యం లేకుండా టాకీ పార్ట్ పూర్తయిందని నితిన్ తెలిపారు. పక్కా ప్లానింగ్ ఉంటే తక్కువ సమయంలోనూ సినిమా షూటింగ్ పూర్తి చేయవచ్చని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

By - Sivaji Kontham
Update: 2026-11-27 04:02 GMT

హీరో నితిన్ నటించిన `అలియాస్ రుక్మిణి` చిత్రం షూటింగ్‌ను కేవలం 48 రోజుల్లోనే పూర్తి చేసినట్లు నితిన్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులన్నింటినీ ముందే పక్కాగా సిద్ధం చేసుకుని తన వద్దకు వచ్చారని నితిన్ తెలిపారు. పక్కా ప్లానింగ్, స్పష్టమైన విజన్ ఉండటం వల్లే తక్కువ వ్యవధిలో టాకీ పార్ట్‌ను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయగలిగామని నితిన్ వివరించారు.

సినీ నిర్మాణంలో వేగం, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే దర్శకనిర్మాతలు పక్కా ప్రీ-ప్లానింగ్, వేగవంతమైన ఎగ్జిక్యూషన్‌తో తక్కువ సమయంలోనూ విజయవంతమైన చిత్రాలను అందించగలరని నిరూపించారు. రామ్ గోపాల్ వర్మ తనదైన స్పీడ్ అప్రోచ్ తో ప్రాజెక్టులలో చూపిన దూకుడు.. రవిబాబు తొలినాళ్లలో `అల్లరి` వంటి చిత్రాలను దాదాపు 45 రోజుల్లోనే పూర్తి చేసిన శైలికి మంచి గుర్తింపు ఉంది. అలాగే కొన్ని ప్రయోగాత్మక- తక్కువ బడ్జెట్ సినిమాల‌కు షెడ్యూళ్లు కథ, బడ్జెట్ సమన్వయంతో కొన్ని రోజుల వ్య‌వ‌ధి చిత్రీక‌ర‌ణ‌కు చాలు అని నిరూపించాయి.

ప్రస్తుతం సినిమా బడ్జెట్లు, షెడ్యూళ్లు నెలల తరబడి సాగుతూ నిర్మాతలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్న నేపథ్యంలో ఇలాంటి వేగవంతమైన, ప్రణాళికాబద్ధమైన నిర్మాణ విధానాలు ఇండస్ట్రీకి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి. అనవసరపు జాప్యాలను నివారించి క‌చ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తే వనరుల సమర్థ వినియోగంతో పాటు ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఈ ఉదాహరణలు గుర్తు చేస్తున్నాయి.

పక్కా ప్రీ-ప్రొడక్షన్.. వంద‌శాతం స్ట్రైకింగ్ షెడ్యూల్స్‌తో తక్కువ రోజుల్లో పూర్తి చేయ‌డానికి స్క్రిప్ట్‌పై పూర్తి స్పష్టత.. ఆర్టిస్టుల డేట్ల సమన్వయం చాలా కీల‌కం. ఇండస్ట్రీలో బడ్జెట్ పరిమితులు..టైమ్ మేనేజ్‌మెంట్.. పక్కా ప్లానింగ్ కలిసొచ్చినప్పుడు 30 నుంచి 50 రోజుల్లోపే పలు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ `ఖైదీ` సినిమాని నైట్ షెడ్యూల్స్‌లో వేగంగా పూర్తి చేయడంతో షూటింగ్ డేస్ త‌గ్గిపోయాయి. డిజిట‌ల్ క్యామ్స్ తో ప్ర‌యోగాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ `ఐస్ క్రీమ్` స‌హా పలు ప్రయోగాత్మక చిత్రాలను త‌క్కువ స‌మ‌యంలోనే తెర‌కెక్కించారు. అలాగే ఇటీవలి కాలంలో కొత్త తరం దర్శకులు ఫాస్ట్-పేస్డ్ షెడ్యూల్స్‌తో తెరకెక్కిస్తున్న మీడియం బడ్జెట్ చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి.

ముందుగా స్క్రిప్ట్ లాక్ చేసి, ప్రీ-ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసుకుని సెట్‌లోకి వెళ్తే అనవసర ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని `అలియాస్ రుక్మిణి` వంటి ప్రాజెక్టులు మరోసారి నిరూపిస్తున్నాయి. నితిన్ చెప్పినట్లుగా వేగంగా పూర్తి చేసినా కంటెంట్ క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇప్పుడు కీలకంగా మారింది.

30 రోజుల నుండి కొన్ని వారాల లోపు తక్కువ-బడ్జెట్ ప్రయోగాలు హాలీవుడ్ లో ఉన్నాయి. సింగిల్-కాన్సెప్ట్ ప్రాజెక్ట్‌లు వేగాన్ని మరింత పెంచుతాయి. కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే సినిమా షెడ్యూళ్ల‌ నుండి 11 అవ‌ర్స్ (ఒకే రోజులో చిత్రీక‌రించిన‌) లోనే షూట్ ముగించిన రికార్డ్ బ్రేకింగ్ ప్ర‌య‌త్నాలు గ‌తంలో జ‌రిగాయి.

Tags:    
  • nithiin 
  • aliasrukmini 
  • muralkanthdevosoth 
  • telugucinema 
  • tollywood 

Similar News

వీకెండ్ జాత‌ర‌: ఆదర్శ కుటుంబం- గరివిడి లక్ష్మి ఓటీటీలో

2026-11-27 04:02 GMT

'కింగ్‌'ను సైలెంట్‌గా ఉండ‌మ‌న్న‌ అంబానీ? లీగ‌ల్ నోటీస్ క‌ల‌కలం!

2026-11-27 04:01 GMT

భార్య‌తో అక్కినేని చియాన్ జ‌పాన్ ట్రిప్ వెన‌క అసలు కారణమిదే!

2026-11-27 04:01 GMT

నంది అవార్డుల క‌మిటీ ఛైర్మ‌న్‌గా NBK .. కొత్త ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి!

2026-11-27 04:01 GMT

తెలుగు సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి.. పొగ‌డ్త కాదు బ‌రువు!

2026-11-27 04:00 GMT

Bigg Boss Telugu 10: మాజీ విన్నర్ల సందడితో హౌస్‌లో కొత్త జోష్

2026-11-27 03:59 GMT

ధనుష్ సినిమా.. మళ్ళీ అదే వరస

2026-11-27 03:58 GMT

'ENE Repeat' క్లీన్ హిట్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్!

2026-11-27 03:57 GMT

'భోగి' USA థియేటర్స్ లిస్ట్

2026-11-27 03:53 GMT

ఆ న‌లుగురి కోసం అవే పాత చింత‌కాయ క‌థ‌లు!

2026-11-27 02:28 GMT

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

2026-11-27 02:28 GMT

Copyright @2026

Powered by Blink CMS