• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుష్ సినిమా.. మళ్ళీ అదే...

ధనుష్ సినిమా.. మళ్ళీ అదే వరస

| ధనుష్ నటించిన 'ఓం' సినిమాకు తమిళంలో నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. విదేశాల్లోనూ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అయితే తెలుగులో మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడంతో నిర్మాత నాగవంశీకి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ భాషలో తడబడుతున్న ధనుష్‌కు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది.

By - Garuda Media
Update: 2026-11-27 03:58 GMT

తమిళ నటుడు ధనుష్ కొన్నేళ్లుగా తెలుగులో తన మార్కెట్ విస్తరించడానికి గట్టిగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు దర్శకులు, నిర్మాతలతో అతను సినిమాలు చేశాడు. వెంకీ అట్లూరితో చేసిన 'సార్', శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'కుబేర' తెలుగులో మంచి ఫలితాలు అందుకున్నాయి. కానీ ఈ రెండు సినిమాలూ తెలుగులో ఆడినంత బాగా తమిళంలో ఆడలేదు. ముఖ్యంగా కుబేర అయితే తమిళంలో ఫ్లాప్ గా నిలిచి తెలుగులో మంచి హిట్ అవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో ధనుష్ రచ్చ గెలిచి ఇంత ఓడిపోతున్నాడే అనే డిస్కషన్ నడిచింది. ఇప్పుడు ఇదే ఒరవడి 'ఓం' విషయంలోనూ ఇదే జరుగుతోంది.

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ సినిమా ఆ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా నెగెటివే. స్పై సినిమా కావడంతో రిలీజ్‌‌కు ముందు 'ఓం'ను 'దురంధర్'తో పోల్చారు. కానీ స్పై సినిమా ఎలా తీయాలో చెప్పడానికి 'దురంధర్' ఉదాహరణగా నిలిస్తే, ఎలా తీయకూడదనడానికి 'ఓం' ఎగ్జాంపుల్ అయింది. సిల్లీ క్యారెక్టర్లు, లాజిక్ లేని సీన్లతో సినిమాను తేల్చిపడేశాడు రాజ్‌కుమార్.

టాక్, రివ్యూలకు తగ్గట్లే ఈ సినిమా 'ఓం' తమిళంలో సరైన వసూళ్లు సాధించలేదు. బ్రేక్ ఈవెన్ కావడం చాలా కష్టమని సినిమా ఫ్లాప్ అని అంటున్నారు. యుఎస్‌ సహా విదేశాల్లో కూడా ఈ సినిమాను పెద్దగా చూడట్లేదు. ఇందులో కంటెంట్ అందరికీ అర్థమై పక్కన పెడుతుంటే.. తెలుగు ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. తెలుగు వరకు ఆల్రెడీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయిందట. 7 కోట్ల అడ్వాన్సుతో సినిమాను రిలీజ్ చేసిన నాగవంశీ ఈ సినిమాతో ఆల్రెడీ పెట్టుబడి రాబట్టి లాభాలు కూడా అందుకుంటున్నాడు. ధనుష్ సినిమాను తమిళులు ఓన్ చేసుకోని స్థితిలో వీక్ కంటెంట్ ఉన్నా సరే మనవాళ్ళు ఇంతలా ఆదరించడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ క్రమంగా సొంత భాషలో వీక్ అయిపోతున్నాడు ధనుష్.

Tags:    
  • dhanush 
  • ommovie 
  • om 
  • mammootty 
  • saipallavi 

Similar News

48 రోజుల్లోనే `అలియాస్ రుక్మిణి`.. తక్కువ రోజుల్లో తెరకెక్కిన సినిమాలివే!

2026-11-27 04:02 GMT

వీకెండ్ జాత‌ర‌: ఆదర్శ కుటుంబం- గరివిడి లక్ష్మి ఓటీటీలో

2026-11-27 04:02 GMT

'కింగ్‌'ను సైలెంట్‌గా ఉండ‌మ‌న్న‌ అంబానీ? లీగ‌ల్ నోటీస్ క‌ల‌కలం!

2026-11-27 04:01 GMT

భార్య‌తో అక్కినేని చియాన్ జ‌పాన్ ట్రిప్ వెన‌క అసలు కారణమిదే!

2026-11-27 04:01 GMT

నంది అవార్డుల క‌మిటీ ఛైర్మ‌న్‌గా NBK .. కొత్త ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి!

2026-11-27 04:01 GMT

తెలుగు సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి.. పొగ‌డ్త కాదు బ‌రువు!

2026-11-27 04:00 GMT

Bigg Boss Telugu 10: మాజీ విన్నర్ల సందడితో హౌస్‌లో కొత్త జోష్

2026-11-27 03:59 GMT

'ENE Repeat' క్లీన్ హిట్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్!

2026-11-27 03:57 GMT

'భోగి' USA థియేటర్స్ లిస్ట్

2026-11-27 03:53 GMT

ఆ న‌లుగురి కోసం అవే పాత చింత‌కాయ క‌థ‌లు!

2026-11-27 02:28 GMT

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

2026-11-27 02:28 GMT

Copyright @2026

Powered by Blink CMS