• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ న‌లుగురి కోసం అవే పాత...

ఆ న‌లుగురి కోసం అవే పాత చింత‌కాయ క‌థ‌లు!

| చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటికీ రొటీన్ మాస్, యాక్షన్ కథలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవితేజ ‘ఇరుముడి’లో ఇమేజ్‌కు భిన్నంగా హుందా పాత్రతో మెప్పించడంతో సీనియర్ హీరోలు కూడా వైవిధ్యమైన కథలు ఎంచుకోవాలనే చర్చ మొదలైంది. గత ప్రయోగాల పరాజయాలే వారి వెనుకడుగుకు కారణమని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

By - Sivaji Kontham
Update: 2026-11-27 02:28 GMT

తెలుగు సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా నాలుగు మూలస్తంభాలుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ అగ్ర హీరోల‌ కోసం టాలీవుడ్ దర్శక రచయితలు ఇప్పటికీ అవే పాత రొటీన్ మాస్, యాక్షన్ కథలనే రాస్తుండటంపై సినీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, మాలీవుడ్‌లో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజాలు తమ వయసుకు తగ్గ వైవిధ్యమైన, ప్రయోగాత్మక పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటే.. మన తెలుగు సీనియర్ స్టార్స్ మాత్రం ఇంకా అవే కమర్షియల్ చట్రంలోనే ఇరుక్కుపోయారనే చర్చ బలంగా నడుస్తోంది.

ఇటీవల విడుదలైన `ఇరుముడి` చిత్రంలో మాస్ మహారాజా రవితేజ తన ఇమేజ్‌ను పక్కనపెట్టి ఎంతో సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో రక్తి కట్టించారు. ఆ సినిమాలో అతడి పాత్ర ఎంతో డిగ్నిటీతో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ లాంటి మాస్ హీరోనే అంతటి హుందా అయిన ప్రయోగాత్మక పాత్రలో మెప్పించినప్పుడు.. దశాబ్దాల అనుభవం ఉన్న మన నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ఆ తరహా ప్రయత్నాలు చేయకపోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. సీనియ‌ర్ల వయసు- స్థాయికి తగ్గ ఆహ్లాదకరమైన, బలమైన స్క్రిప్టులను మన రచయితలు సృజించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ఈ సీనియర్ హీరోలందరూ కేవలం భారీ బడ్జెట్ కమర్షియల్, హైవోల్టేజ్ యాక్షన్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఫలితంగా కంటెంట్ ఉన్న ప్రయోగాత్మక చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో వీరిని చూసే అవకాశం ప్రేక్షకులకు లేకుండా పోయింది. అభిమానుల అంచనాలు, మార్కెట్ లెక్కల పేరుతో దర్శకులు కూడా సేఫ్ గేమ్ ఆడుతూ రొటీన్ ఫార్ములా కథలనే వీరి ముందుంచుతున్నారు.

అయితే ఈ సీనియర్ హీరోలు ప్రయోగాలకు దూరంగా ఉండటానికి మరో బలమైన కారణం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వీరంతా ఎంతో ఇష్టపడి నటించిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వీరి ఆలోచనా ధోరణిని మార్చేసింది. ప్రయోగాలు చేస్తే కమర్షియల్‌గా దెబ్బతింటామనే భయంతోనే ఈ నలుగురు స్టార్ హీరోలు మళ్లీ తమకు అచ్చొచ్చిన మాస్ యాక్షన్ బాటలోనే పయనిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    
  • chiranjeevi 
  • balakrishna 
  • nagarjuna 
  • venkatesh 
  • raviteja 
  • irumudi 
  • tollywood 

Similar News

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

2026-11-27 02:28 GMT

సీక్రెట్ గా బోల్డ్ రైటర్.. 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ ఎలా ఉందంటే..

2026-11-27 02:27 GMT

సాయి పల్లవి తన హద్దులు చెరిపేసుకుందా?

2026-11-27 02:25 GMT

డార్క్ హీరోయిజం ట్రెండ్ ఆ ముగ్గురితో పీక్స్!

2026-11-27 01:30 GMT

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయ్యేనా?

2026-11-26 22:30 GMT

ప్రతి ఫ్రేమ్‌లో VFX మాయాజాలం ప్ల‌స్సా మైన‌స్సా?

2026-11-26 19:30 GMT

వారణాసి : ఆరు నెలలు సరిపోవట!

2026-11-26 18:30 GMT

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

2026-11-26 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS