• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీక్రెట్ గా బోల్డ్...

సీక్రెట్ గా బోల్డ్ రైటర్.. 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ ఎలా ఉందంటే..

| …నితిన్ నటించిన డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ విడుదలైంది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో నాని సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ కృష్ణ అనే సాఫ్ట్ టైపిస్ట్‌గా కనిపించనున్నారు. అతడి రహస్య అలవాటు వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలే కథాంశం. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-27 02:27 GMT

వరుస కమర్షియల్ సినిమాల తర్వాత నితిన్ రూట్ మార్చి చేసిన డిఫరెంట్ ప్రయత్నం 'అలియాస్ రుక్మిణి'. నేచురల్ స్టార్ నాని సమర్పణలో మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. బయటకు ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపించే ఓ కుర్రాడి సీక్రెట్ అలవాటు, దానివల్ల అతని పెళ్లి జీవితంలో వచ్చే చిక్కుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇందులో నితిన్ కోర్టులో పనిచేసే కృష్ణ అనే సాఫ్ట్ టైపిస్ట్ పాత్రలో కనిపిస్తున్నారు. చూడటానికి ఎంతో డీసెంట్ గా ఉండే కృష్ణకు ఇంటిమసీ విషయంలో కొన్ని విచిత్రమైన కలలు వస్తుంటాయి. ఆ ఆలోచనలతోనే ఎవరికీ తెలియకుండా బోల్డ్ నవలలు రాస్తుంటాడు. ఈ సీక్రెట్ వ్యవహారం వల్ల మూడు పెళ్లి చూపుల్లో రిజెక్ట్ అయిన కృష్ణ జీవితంలోకి నాలుగో సంబంధంగా రుక్మిణి వస్తుంది. ఇద్దరి మధ్య సరదా మాటలతో పెళ్లి కుదిరినా, ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది.

రొటీన్ మాస్ హీరో ఇమేజ్ పక్కన పెట్టి, కృష్ణ పాత్రలో నితిన్ చాలా సహజంగా ఒదిగిపోయారు. పెళ్లి చూపుల సీన్లలో అమాయకత్వం, భార్యతో ఇబ్బందులు ఎదురైనప్పుడు పడే టెన్షన్ ను బాగా క్యారీ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రుక్మిణి పాత్రలో ఆఫియా సయ్యద్ కూడా సహజమైన నటనతో మెప్పించింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్లు కథలోని అసలు పాయింట్ ను సూటిగా చెప్పే ప్రయత్నం చేశాయి.

తెలుగు సినిమాల్లో నార్మల్ గా చర్చించని ఒక సున్నితమైన అంశాన్ని దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్నారు. అయితే దాన్ని మరీ వల్గర్ గా కాకుండా, కాస్త హ్యూమర్, ఎమోషన్ కలిపి డీల్ చేసినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, సాయి కుమార్ తమ పాత్రల్లో కథకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ డ్రామాతో పాటు కాపురంలో వచ్చే ఇబ్బందులను రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం కనిపిస్తోంది.

విజయ్ బుల్గానిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మెలోడీ టచ్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. సన్నివేశాల్లోని ఎమోషన్ కు తగ్గట్టు మ్యూజిక్ ప్లెజెంట్ గా సాగింది. నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మించిన ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు నీట్ గా ఉన్నాయి. డిసెంబర్ 4న 'అలియాస్ రుక్మిణి' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ లో చూపించిన కొత్త పాయింట్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.


Full View


Tags:    
  • nithiin 
  • aliasrukmini 
  • aliasrukminitrailer 
  • naturalstarnani 
  • aafiyasyed 

Similar News

ఆ న‌లుగురి కోసం అవే పాత చింత‌కాయ క‌థ‌లు!

2026-11-27 02:28 GMT

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

2026-11-27 02:28 GMT

సాయి పల్లవి తన హద్దులు చెరిపేసుకుందా?

2026-11-27 02:25 GMT

డార్క్ హీరోయిజం ట్రెండ్ ఆ ముగ్గురితో పీక్స్!

2026-11-27 01:30 GMT

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయ్యేనా?

2026-11-26 22:30 GMT

ప్రతి ఫ్రేమ్‌లో VFX మాయాజాలం ప్ల‌స్సా మైన‌స్సా?

2026-11-26 19:30 GMT

వారణాసి : ఆరు నెలలు సరిపోవట!

2026-11-26 18:30 GMT

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

2026-11-26 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS