• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆకాశంలో ఒక తార......

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

| దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని తెరకెక్కించిన ‘ఆకాశంలో ఒక తార’కు మంచి రివ్యూలు వస్తున్నా, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాత్విక నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే చాలామంది ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తుండటంపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలోనే సినిమాను ఆదరించాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు.

By - Ramesh Palla
Update: 2026-11-26 17:40 GMT

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'ఆకాశంలో ఒక తార'. ఈ సినిమాకు రివ్యూవర్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దుల్కర్‌ యాక్టింగ్‌ బాగుందని, ఆయన లుక్‌ విషయంలో కొత్తగా అనిపించాడని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్‌ సాత్విక వీరవల్లి గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. తెలుగు అమ్మాయి కావడంతో ఈమె ఎలా చేస్తుంది, ఎలా ఉంటుంది అనే అనుమానాలు విడుదలకు ముందు ఉండేవి. కానీ సినిమా చూసిన తర్వాత సినిమాలోని కల్పన పాత్రకు జీవం పోసినట్లుగా నటించింది అంటూ రివ్యూవర్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవరాల్‌గా సాత్విక వీరవల్లి మంచి మార్కులు దక్కించుకుని మొదటి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ....

సినిమాకు వచ్చిన టాక్‌కి, రివ్యూస్‌కి సంబంధం లేకుండా వసూళ్లు నమోదు అవుతున్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. గతంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన లక్కీ భాస్కర్‌ సినిమా సైతం పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది, మౌత్‌ టాక్‌ కూడా పాజిటివ్‌గా ఉంది. అయినా కూడా వసూళ్లు గొప్పగా లేవు. టాక్‌ కు తగ్గట్లుగా వసూళ్లు లేకపోవడం తెలిసిందే. లక్కీ భాస్కర్‌ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో జనాలు పెద్దగా పట్టించుకోలేదు అనే అభిప్రాయం ఉంది. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన సమయంలో చాలా మంది చూశారు. ఓటీటీలో వచ్చిన స్పందన థియేట్రికల్‌ రిలీజ్‌ సమయంలో వచ్చి ఉంటే కచ్చితంగా రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు వచ్చి ఉండేది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని బాక్సాఫీస్‌ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నిర్మాతలు, బయ్యర్లు ఉన్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా టాక్‌ కి తగ్గట్లుగా వసూళ్లు రాబట్టడం లేదు.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా...

ఆకాశంలో ఒక తార సినిమా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బ్రేక్ ఈవెన్‌ ఎప్పుడో కావాల్సిందని, ఇప్పటి వరకు వంద కోట్లకు పైగా వసూళ్లు చేయాల్సిన సినిమా అని కొందరు సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్నారు. చాలా మంది ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ఆకాశంలో ఒక తారా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు అని సెర్చ్‌ చేస్తున్నారట. గూగుల్‌ లోనూ ఇదే విషయాన్ని ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం మొదలు పెట్టారు, మంచి సినిమాలకు థియేటర్ల ద్వారా మంచి వసూళ్లు వస్తున్నాయని భావిస్తున్న సమయంలో మళ్లీ ఈ సినిమాను ఓటీటీలో చూడాలని జనాలు కోరుకోవడం ఏంటో అని సినీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అరవింద్‌, స్వప్న దత్‌...

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పించిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌తో పాటు ఈ సినిమా నిర్మాణ వ్యవహారంను అశ్వినీదత్‌ కూతురు స్వప్న దత్‌ సైతం చూసుకున్నట్లు తెలుస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాను చేయడం ద్వారా మరోసారి టాలీవుడ్‌లో మంచి నటుడు అనే పేరు సొంతం చేసుకోవడంతో పాటు, లేడీ ఫ్యాన్స్‌ ను మరింతగా పెంచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఆకాశంలో ఒక తారా సినిమాను విడుదల చేయకుంటే కచ్చితంగా చాలా మంచి సినిమాను మిస్ అయ్యేవాళ్లం అని నిర్మాత స్వప్న దత్‌ అన్నారు. ఇలాంటి సినిమాను ఓటీటీలో చూడటం కోసం ఎదురు చూడకుండా థియేటర్‌ కు వెళ్లి చూస్తే నిర్మాతను, దర్శకులను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం, ఇలాంటి సినిమాలు మరిన్ని వారి నుంచి వచ్చే అవకాశం ఉంటుందని సినీ ప్రేమికులు సోషల్‌ మీడియాలో సినిమాను ప్రమోట్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Tags:    
  • aakasamlookatara 
  • dulquersalmaan 
  • satvikaveeravalli 
  • alluaravind 

Similar News

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఎవరీ అలియాస్ రుక్మిణీ.. తొలిచూపులోనే ఫిదా చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

2026-11-26 17:39 GMT

ర‌క్త‌పాతానికి ఎమోష‌న్‌కి లింక్ పెట్టాడు.. 'భోగి' వ‌యోలెన్స్ స్టోరీ!

2026-11-26 17:36 GMT

పవన్‌ కళ్యాణ్‌తో గొడవ... పదేళ్ల తర్వాత క్లారిటీ!

2026-11-26 17:30 GMT

నా డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది: అనిల్ రావిపూడి

2026-11-26 17:26 GMT

గోల్డ్ మినీ డ్రెస్‌లో మెరిసిన నభా నటేష్.. అదిరిపోయే లుక్!

2026-11-26 17:25 GMT

అత‌డి స‌వాల్ ని ప్ర‌త్య‌ర్దులు ఎలా తీసుకుంటున్నారు?

2026-11-26 16:30 GMT

వృషకర్మ తర్వాత మెగా హీరోతో కన్ఫర్మ్‌..!

2026-11-26 15:30 GMT

వాంటెడ్: టాలీవుడ్ కి పాన్ ఇండియా రైట‌ర్లు !

2026-11-26 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS