సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే
| ఈ ఏడాది ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ సినిమాలతో నిరాశపరిచిన శర్వానంద్ ఇప్పుడు ‘భోగి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రిస్మస్‌కు విడుదల కానున్న ఈ సినిమా ఫలితంపై ‘జార్జ్ క్రిష్’ ఆశలు ఆధారపడి ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
శర్వానంద్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సంక్రాంతికి నారి నారి నడుమ మురారి సినిమా విడుదల కాగా, ఆ తర్వాత బైకర్ సినిమాతో వచ్చాడు. రెండు సినిమాలు భారీ అంచనాలను మోస్తూ వచ్చాయి. కానీ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. సినిమాలు పడ్డా శర్వానంద్ మాత్రం ఆగలేదు. మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ ఏడాదిలో మూడో సినిమాగా 'భోగి' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ట్రైలర్ చూసిన తర్వాత మరింతగా పెరిగాయి. భోగి అనే టైటిల్ పెట్టుకుని సంక్రాంతికి వస్తే బాగుంటుంది కదా అని చాలామంది అంటున్నారు. కానీ సంక్రాంతితో ఈ సినిమాకు సంబంధం లేదని మేకర్స్ చెబుతున్నారు.
శర్వానంద్ భోగి సినిమా...
భోగి సినిమాతో క్రిస్మస్ ముందు రాబోతున్న శర్వానంద్ సంక్రాంతికి సైతం ఒక సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు సూపర్ హిట్స్ ను అందించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన 'జార్జ్ క్రిష్' సంక్రాంతి 2027 కి విడుదల కాబోతుంది. పెద్ద సినిమాలు, తీవ్రమైన పోటీ నడుమ జార్జ్ క్రిష్ ను విడుదల చేయబోతున్నారు. శ్రీను వైట్ల తన మార్క్ కామెడీతో పాటు ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకు నెలన్నర రోజులు ఉండగానే షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాపై దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
జార్జ్ క్రిష్ సినిమాతో సంక్రాంతికి...
జార్జ్ క్రిష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న నేపథ్యంలో మేకర్స్ కి కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటేనే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తారు. శ్రీనువైట్ల ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం ఏర్పడింది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను శర్వానంద్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో శర్వానంద్ భోగి సినిమా విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. భోగి సినిమా ఫలితం ఆధారంగా జార్జ్ క్రిష్ సంక్రాంతి సందడి ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో భోగి సినిమాపై మరింత ఒత్తిడి పెరిగినట్లు అయింది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో...
భోగి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి, భారీ వసూళ్లు నమోదు అయితేనే జార్జ్ క్రిష్ సినిమాకు డీసెంట్ బిజినెస్ జరుగుతుంది, మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతాయి. సంక్రాంతి సినిమాలకు ఓపెనింగ్ ముఖ్యం. ఓపెనింగ్ బాగున్న సినిమాలకు తప్పకుండా లాంగ్ రన్‌లోనూ మంచి వసూళ్లు ఉంటాయి. సంక్రాంతి వీక్ మొత్తం సినిమాలు ఏ మేరకు వసూళ్లు చేస్తాయో అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కనుక జార్జ్ క్రిష్ సినిమా సంక్రాంతికి మంచి ఓపెనింగ్ దక్కించుకోవాలి అంటే కచ్చితంగా రేపు విడుదల కాబోతున్న భోగి సినిమా సూపర్ హిట్ కావాల్సి ఉంటుంది. భోగి సినిమా వసూళ్లు ఒక మోస్తరుగా అయినా ఉంటేనే జార్జ్ క్రిష్ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అవుతాయి. కనుక భోగి సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని శర్వానంద్ అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు హిట్ అయితే శర్వానంద్ మళ్లీ దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి.