• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ కళ్యాణ్‌తో గొడవ......

పవన్‌ కళ్యాణ్‌తో గొడవ... పదేళ్ల తర్వాత క్లారిటీ!

| ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నుంచి తాను తప్పుకోవడం వెనుక పవన్ కల్యాణ్‌తో ఎలాంటి గొడవలు లేవని దర్శకుడు సంపత్ నంది స్పష్టం చేశాడు. సినిమా ఆలస్యమవుతుండటంతో పవన్ అనుమతితోనే మరో ప్రాజెక్ట్ చేసుకునేందుకు బయటకు వచ్చానని వెల్లడించాడు. ఐదేళ్ల విరామం తర్వాత శర్వానంద్‌తో చేసిన ‘భోగి’తో విజయం సాధించాలని చూస్తున్నాడు.

By - Ramesh Palla
Update: 2026-11-26 17:30 GMT

రామ్‌ చరణ్‌తో 'రచ్చ' చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సంపత్‌ నంది. ఆ తర్వాత చేసిన సినిమాలు భారీ విజయాలు, బ్లాక్‌ బస్టర్‌ లు కాకున్నా కూడా ఎప్పుడూ సంపత్‌ నంది వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా సరిగ్గా పదేళ్ల క్రితం పవన్‌ కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా నుంచి తప్పుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. సాధారణంగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ దర్శకుడు అయినా కళ్లు మూసుకుని చేస్తాడు. ఇతర ఏ విషయాలు పట్టించుకోకుండా పవన్‌తో వర్క్ చేసేందుకు కట్టుబడి ఉంటాడు. కానీ సంపత్‌ నంది మాత్రం పవన్‌ కళ్యాణ్‌ ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చినా చేజేతులా జార విడ్చుకున్నాడు. పదేళ్ల కాలంలో ఆయన నుంచి చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏ ఒక్కటి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన నిర్మాణంలోనూ సినిమాలు వచ్చినప్పటికీ అవి కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు.

శర్వానంద్‌ భోగి సినిమాతో...

సంపత్ నంది అయిదు ఏళ్ల క్రితం సిటీమార్‌ సినిమాతో వచ్చాడు. దర్శకుడిగా చాలా గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు 'భోగి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శర్వానంద్‌ హీరోగా నటించిన భోగి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా నుంచి బయటకు రావడానికి గల కారణం పై స్పందించాడు. దాన్ని ఇప్పటి వరకు మీడియాలో ఫ్యాన్స్ లో చర్చిస్తున్నారు, అయితే అక్కడ అంత పెద్ద వివాదం ఏమీ లేదని, దాన్ని చాలా సింపుల్‌ మ్యాటర్‌గా సంపత్‌ నంది కొట్టి పారేశాడు. ఇరు వైపుల ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం, అయితే ఇరువైపుల మాట్లాడుకున్న తర్వాత ఇబ్బంది లేదని నిర్ణయించుకుని సినిమా నుంచి తప్పుకున్నట్లు గా సంపత్ నంది పేర్కొన్నాడు.

సంపత్‌ నంది దర్శకత్వంలో...

ఇంకా సంపత్‌ నంది మాట్లాడుతూ... సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాకు మొదటి డైరెక్టర్‌ను నేనే. పవన్‌ కళ్యాణ్‌ గారు వరుసగా సినిమాలు చేస్తూ ఉండటం, ఇంకా నా వ్యక్తిగత కారణాలు, పవన్‌ గారి కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ మొదట అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ ఆలస్యం కావడంతో తాను బయటకు రావాల్సి వచ్చిందని అన్నాడు. పవన్‌ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను పిలిచి సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్‌ చేస్తావా, లేదంటే మరో సినిమా ఏమైనా చేసుకుంటావా అన్నట్లుగా ప్రశ్నించారు. నేను ఈ గ్యాప్‌లో వేరే సినిమాను చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని పవన్‌ కళ్యాణ్ గారిని అడిగాను, అంతే తప్ప గొడవలు పడి సినిమా నుంచి బయటకు వచ్చిన మాట పూర్తిగా అవాస్తవం అని సంపత్‌ నంది పదేళ్ల క్రితం ముచ్చట చెప్పుకొచ్చాడు.

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా...

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాకు దర్శకత్వం వహించాల్సిన సంపత్‌ నంది తప్పుకోవడంతో ఆ స్థానంలో బాబీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా గబ్బర్‌ సింగ్ రేంజ్‌లో హిట్ కాలేదు. దాంతో దర్శకుడు సంపత్‌ నంది దాన్ని నుంచి బయటకు రావడం మంచిది అయిందని కొందరు మాట్లాడుకున్నారు. కొందరు మాత్రం సంపత్‌ నంది ఆ సినిమాను చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అనే అభిప్రాయం ను వ్యక్తం చేశారు. మొత్తానికి సంపత్‌ నంది ఒక పెద్ద సినిమాను వదిలేశాడు, ఆ తర్వాత చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలను తెరకెక్కిస్తూ, నిర్మిస్తూ కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఇప్పుడు తీసిన 'భోగి' సినిమా మాత్రం భారీ అంచనాలను మోస్తోంది. ఐదేళ్ల బ్రేక్‌ తర్వాత రాబోతున్న సంపత్‌ నంది ఈ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటాడా అనేది చూడాలి. హీరో శర్వానంద్‌తో పాటు దర్శకుడు సంపత్‌ నందికి ఈ సినిమా విజయం చాలా కీలకం. అందుకే కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు.

Tags:    
  • sampathnandi 
  • pawankalyan 
  • sardargabbarsingh 
  • sharwanand 
  • bhogimovie 

Similar News

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

2026-11-26 17:40 GMT

ఎవరీ అలియాస్ రుక్మిణీ.. తొలిచూపులోనే ఫిదా చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

2026-11-26 17:39 GMT

ర‌క్త‌పాతానికి ఎమోష‌న్‌కి లింక్ పెట్టాడు.. 'భోగి' వ‌యోలెన్స్ స్టోరీ!

2026-11-26 17:36 GMT

నా డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది: అనిల్ రావిపూడి

2026-11-26 17:26 GMT

గోల్డ్ మినీ డ్రెస్‌లో మెరిసిన నభా నటేష్.. అదిరిపోయే లుక్!

2026-11-26 17:25 GMT

అత‌డి స‌వాల్ ని ప్ర‌త్య‌ర్దులు ఎలా తీసుకుంటున్నారు?

2026-11-26 16:30 GMT

వృషకర్మ తర్వాత మెగా హీరోతో కన్ఫర్మ్‌..!

2026-11-26 15:30 GMT

వాంటెడ్: టాలీవుడ్ కి పాన్ ఇండియా రైట‌ర్లు !

2026-11-26 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS