• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి తన హద్దులు...

సాయి పల్లవి తన హద్దులు చెరిపేసుకుందా?

| లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి వరుసగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ‘రామాయణ’లో సీతగా, ధనుష్‌ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. తాజాగా బాల్డ్ హెడ్‌తో డీగ్లామర్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచింది. ఇకపై మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

By - Ramesh Palla
Update: 2026-11-27 02:25 GMT

లేడీ పవర్‌ స్టార్‌గా అభిమానులతో పిలిపించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్‌ సాయి పల్లవి. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరిదీ ఒకదారి అయితే తనది మరో దారి అన్నట్లుగా సాయి పల్లవి వ్యవహరిస్తుందని గతంలో కొందరు విమర్శలు చేశారు. హీరోయిన్‌ అంటే కమర్షియల్‌ పాత్రలు చేయాలి, స్కిన్ షో చేయాల్సిందే. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు నో చెప్పింది. చాలా మంది హీరోయిన్స్‌ ఒక్క సినిమా హిట్‌తో కమర్షియల్‌ రూట్‌లో వెళ్తుంటే, సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చేది. అయినా కూడా సాయి పల్లవితో సినిమాలకు ఎంతో మంది స్టార్‌ హీరోలు ఆసక్తి చూపించారు. స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెతో వర్క్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక ప్రముఖ నిర్మాతలు కోట్ల రూపాయల పారితోషికం సాయి పల్లవికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు అనడంలో సందేహం లేదు.

రామాయణంలో సాయి పల్లవి పాత్ర...

సాయి పల్లవి కమర్షియల్‌ రోల్స్ చేస్తే ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఆమె మాత్రం తన హద్దుల్లో ఉంది. ఎప్పుడూ హద్దు దాటకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. సాయి పల్లవి ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయింది. ఇప్పుడు ఆమె నుంచి కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ ఏడాది సాయి పల్లవిని సీత పాత్రలో చూశాం. రణబీర్ కపూర్‌ హీరోగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన రామాయణ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటించిన విషయం తెల్సిందే. చాలా మంది సీత పాత్రకు సాయి పల్లవి ఎంపిక చాలా బెస్ట్‌ అన్నారు. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీత పాత్రకు సాయి పల్లవి సెట్‌ కాలేదని కొందరు, జటాయివు సీన్‌ సమయంలో సాయి పల్లవి యాక్టింగ్‌ మరీ పూర్‌ గా ఉందని మరి కొందరు విమర్శలు చేశారు.

ధనుష్‌ మూవీలో సాయి పల్లవి...

నటిగా సాయి పల్లవి తనను తాను నిరూపించుకునేందుకు ఇన్నాళ్లు సినిమాలు చేసింది. ఇకపై కొత్త తరహా పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో సాయి పల్లవి నుంచి రెండు కొత్త పాత్రలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆమె పోషించని పాత్రలు పోషిస్తున్న కారణంగా తన రూటు మార్చుకుందా, తన హద్దులు చేరిపేసుకుందా అనే చర్చ మొదలైంది. ఇటీవల ధనుష్‌ హీరోగా నటించిన ఓం సినిమాతో సాయి పల్లవి వచ్చింది. ఆ సినిమాలో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించింది. ఆ సినిమా సైతం మంచి పేరును తెచ్చి పెట్టింది. అయితే సాయి పల్లవిని పోలీస్‌ ఆఫీసర్‌గా చూడలేక పోయాం అని కొందరు అన్నారు. ఇన్నాళ్లు ఒకే తరహాలో కనిపించిన సాయి పల్లవి ఇప్పుడు సీతగా, పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడంతో ఆమె అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు అనేది వాస్తవం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు...

సాయి పల్లవి మొదటి నుంచి ఇలా విభిన్నమైన పాత్రలు చేసి ఉంటే తప్పకుండా ఇప్పుడు చేసిన పాత్రలను మరింతగా స్వీకరించే వారు. ఇప్పుడు కొత్తగా అనిపించేవి కాదు. తాజాగా సాయి పల్లవి మరో కొత్త లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది, డీ గ్లామర్‌గా, బాల్‌ హెడ్‌ తో సాయి పల్లవి కనిపించడంతో ఆమె అభిమానులు సైతం సర్‌ప్రైజ్ అవుతున్నారు. సాయి పల్లవి ఇంకా ఎంత కాలం ఇలా సర్‌ప్రైజ్ చేస్తుందని అభిమానులు మాట్లాడుతున్నారు. సినీ విశ్లేషకులు మాత్రం సాయి పల్లవి ఇకపై ఇలాంటి విభిన్నమైన పాత్రలు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముందు ముందు సాయి పల్లవి నుంచి వచ్చే పాత్రలు, సినిమాలు చూసి మరింతగా ఆశ్చర్యపోవాల్సి వస్తుందేమో చూడాలి. తనను తాను మార్చుకుని, తనకు ఇన్నాళ్లు ఉన్న హద్దులను చెరిపేసుకోవడం వల్ల ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది చాలా మంది మాట.

Tags:    
  • saipallavi 
  • saipallavicareer 
  • ramayana 
  • dhanush 
  • tollywood 

Similar News

ఆ న‌లుగురి కోసం అవే పాత చింత‌కాయ క‌థ‌లు!

2026-11-27 02:28 GMT

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

2026-11-27 02:28 GMT

సీక్రెట్ గా బోల్డ్ రైటర్.. 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ ఎలా ఉందంటే..

2026-11-27 02:27 GMT

డార్క్ హీరోయిజం ట్రెండ్ ఆ ముగ్గురితో పీక్స్!

2026-11-27 01:30 GMT

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయ్యేనా?

2026-11-26 22:30 GMT

ప్రతి ఫ్రేమ్‌లో VFX మాయాజాలం ప్ల‌స్సా మైన‌స్సా?

2026-11-26 19:30 GMT

వారణాసి : ఆరు నెలలు సరిపోవట!

2026-11-26 18:30 GMT

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

2026-11-26 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS