• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రతి ఫ్రేమ్‌లో VFX...

ప్రతి ఫ్రేమ్‌లో VFX మాయాజాలం ప్ల‌స్సా మైన‌స్సా?

| నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ వీఎఫ్‌ఎక్స్ ఉంటుందని నాగచైతన్య వెల్లడించారు. అయితే గ్రాఫిక్స్ కంటే కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

By - Sivaji Kontham
Update: 2026-11-26 19:30 GMT

అక్కినేని నాగచైతన్య హీరోగా, `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ `వృషకర్మ`పై భారీ అంచనాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ ఏదో ఒక వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుందని స్వయంగా నాగచైతన్య వెల్లడించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. టెక్నిక‌ల్ హంగులకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ డామినేషన్ మధ్య అసలైన ఎమోషన్ ఏ మేరకు పండుతుందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక `వృషకర్మ` కథాంశం విషయానికొస్తే.. పురాతన శాస్త్రాలు-నిధి అన్వేషణ- క్షుద్రశక్తుల నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన ఫిక్షన్ డ్రామా ఇది. ఇందులో నాగచైతన్య ఒక ట్రెజర్ హంటర్ (పురాతన వస్తువుల అన్వేషకుడు) పాత్రలో కనిపించనున్నారు. `దైవం వర్సెస్ దెయ్యం` అనే కాన్సెప్ట్ భారతీయ సినిమాకు కొత్తేమీ కాకపోయినా ఒక కర్తవ్యం లేదా `వృషకర్మ` కోణంలో చీకటి శక్తులకు- దైవశక్తికి మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు కార్తీక్ దండు ఎంతో కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ట్రైలర్ ఆద్యంతం వీఎఫ్‌ఎక్స్ పనితనం ప్రేక్షకులను కట్టిపడేసిన నేప‌థ్యంలో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ముఖ్యంగా గబ్బిలాల గుంపు, భీతావహ ఆత్మలతో కూడిన వికృత విన్యాసాలను ఎంతో సహజంగా, లాజికల్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో పకడ్బందీగా డిజైన్ చేయడంతో.. పూర్తి సినిమాలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలనే ఉత్కంఠ రెట్టింపైంది.

అయితే స‌న్నివేశ బ‌లాన్ని కానీ క‌థాగ‌మ‌నాన్ని కానీ డిస్ట్ర‌బ్ చేయ‌కుండా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉండాల‌ని కూడా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. క‌థ‌లో గ్రాఫిక్స్ ఒక భాగం మాత్ర‌మే. గ్రాఫిక్స్ డామినేష‌న్ కూడ‌ద‌ని కూడా సూచిస్తున్నారు. అయితే `విరూపాక్ష` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కార్తీక్ దండు చేస్తున్న ఈ విభిన్న ప్రయోగం ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వబోతోందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫిక్షన్ కథనాన్ని ప్రేక్షకులకు కన్విన్సింగ్‌గా చెప్పడంలో కార్తీక్ సఫలమైతే.. నాగచైతన్య కెరీర్‌లో `వృషకర్మ` మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమనే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డిసెంబ‌ర్ 4న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Tags:    
  • vrushakarma 
  • nagachaitanya 
  • karthikdandu 
  • vrushakarmatrailer 

Similar News

వారణాసి : ఆరు నెలలు సరిపోవట!

2026-11-26 18:30 GMT

సంక్రాంతికి నిలవాలంటే 'భోగి' ఆడాల్సిందే

2026-11-26 17:43 GMT

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

2026-11-26 17:42 GMT

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

2026-11-26 17:41 GMT

ఆకాశంలో ఒక తార... థియేటర్‌లో ఉండగా ఎదురు చూపులు!

2026-11-26 17:40 GMT

ఎవరీ అలియాస్ రుక్మిణీ.. తొలిచూపులోనే ఫిదా చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

2026-11-26 17:39 GMT

ర‌క్త‌పాతానికి ఎమోష‌న్‌కి లింక్ పెట్టాడు.. 'భోగి' వ‌యోలెన్స్ స్టోరీ!

2026-11-26 17:36 GMT

పవన్‌ కళ్యాణ్‌తో గొడవ... పదేళ్ల తర్వాత క్లారిటీ!

2026-11-26 17:30 GMT

నా డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది: అనిల్ రావిపూడి

2026-11-26 17:26 GMT

గోల్డ్ మినీ డ్రెస్‌లో మెరిసిన నభా నటేష్.. అదిరిపోయే లుక్!

2026-11-26 17:25 GMT

అత‌డి స‌వాల్ ని ప్ర‌త్య‌ర్దులు ఎలా తీసుకుంటున్నారు?

2026-11-26 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS