• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  ఈNఈ కి సీక్వెల్...

ఈNఈ కి సీక్వెల్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది

| 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌ ‘ENE రిపీట్‌’ ప్రేక్షకుల ఆదరణతో వసూళ్లు సాధిస్తోంది. తొలుత మిశ్రమ సమీక్షలు వచ్చినా, వారం రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించినట్లు సమాచారం. రూ.21 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా, ఇప్పటికే రూ.22 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతూ, ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

By - Ramesh Palla
Update: 2026-11-27 06:37 GMT

2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ సినిమాలోని ఎన్నో సీన్స్‌ మీమర్స్‌ కి ఉపయోగపడుతూ ఉంటాయి. సినిమాలోని ప్రతి సీన్‌ను ఏదో ఒక సందర్భంలో యూత్‌ ఆడియన్స్ కనెక్ట్‌ అవుతూ ఉంటారు. అందుకే యూత్‌లో ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే సీక్వెల్‌ అనగానే ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చుతూ వచ్చారు. ఈ నగరానికి ఏమైంది 2 సినిమాను ENE రిపీట్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కల్ట్‌ మూవీకి రీమేక్ అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించామని, తప్పకుండా మరోసారి ఈ సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నట్లుగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ప్రమోషన్స్ సమయంలో చెబుతూ వచ్చాడు. సీక్వెల్‌ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ENE రిపీట్‌ సినిమాకి వసూళ్లు...

ENE రిపీట్‌కి మొదట కొందరు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. మొదటి పార్ట్‌ రేంజ్‌లో లేదని, రొటీన్ కథ, అదే కామెడీ అన్నట్లుగా కూడా కొందరు సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. కట్‌ చేస్తే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. తక్కువ సమయంలోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ నెంబర్స్‌ను నమోదు చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. నెగిటివ్‌ రివ్యూలు ఇచ్చిన వారికి గట్టి షాక్ తగిలే విధంగా కలెక్షన్స్‌ నమోదు అవుతున్నట్లు బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌ ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద మొత్తంలో కలెక్షన్స్‌ వస్తున్నాయి. రెండో వీకెండ్‌లోనూ అదే రేంజ్‌ వసూళ్లు నమోదు చేస్తే బయ్యర్లు భారీ మొత్తంలో లాభాలను లెక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో...

రొటీన్‌ కామెడీ అంటూ రివ్యూలు వచ్చినప్పటికీ హిట్‌ మూవీ సీక్వెల్‌, కల్ట్‌ బొమ్మ సీక్వెల్‌ అనే ట్యాగ్‌ ఉండటంతో ఈ సినిమాను జనాలు చూసేందుకు ఆసక్తి చూపించారు. రివ్యూలను పట్టించుకోకుండా థియేటర్‌ బాట పట్టారు. పాజిటివ్‌ టాక్‌ను ప్రేక్షకులు చెప్పడం వల్ల సోషల్‌ మీడియాలో సినిమా హిట్ అనే టాక్‌ వచ్చింది. దాంతో వారం రోజుల్లోనే సినిమాకు బ్రేక్ ఈవెన్‌ సాధ్యం అయింది. యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా రూ.21 కోట్లకు అమ్మడం జరిగింది. బాక్సాఫీస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా రూ.22 కోట్ల షేర్‌ను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్‌ అయిన సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది.

విశ్వక్‌ సేన్‌ హీరోగా...

ఈ సినిమాకు ఓవర్సీస్‌ నుంచి దాదాపుగా 20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది. రూ.50 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. విశ్వక్‌సేన్‌, అభినవ్‌ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, శివాత్మిక రాజశేఖర్‌, అనీషా ఆంబ్రోస్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కు వివేక్‌ సాగర్‌ సంగీతాన్ని అందించాడు. మొదటి పార్ట్‌లో మాదిరిగానే ఈ సినిమాలోనూ ఫిల్మ్‌ మేకింగ్‌ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. మొదటి పార్ట్‌ కి సంబంధించిన పాత్రలను ఈ పార్ట్‌లో కంటిన్యూ చేయడంతో పాటు, అదే జోనర్ కావడంతో ప్రేక్షకుల ఆధరణ దక్కింది. ప్రేక్షకులు ఆశించిన కామెడీ ఉండటంతో పాటు, యూత్ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయ్యే కొన్ని సీన్స్ ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

Tags:    
  • enerepeat 
  • eenagaranikiemaindi2 
  • vishwaksen 
  • tarunbhaskar 
  • boxoffice 

Similar News

'ENE Repeat' క్లీన్ హిట్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్!

2026-11-27 03:57 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

2026-11-23 05:46 GMT

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

Copyright @2026

Powered by Blink CMS