• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  మూడు వారాల్లోనే 'పుష్ప 2'...

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

| ‘రామాయణం’ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 21 రోజుల్లో రూ.1,755 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డును అధిగమించింది. రూ.1,788 కోట్ల ‘బాహుబలి 2’ రికార్డుకు మరో రూ.33 కోట్ల దూరంలో నిలిచింది. దేశీయంగా రూ.982 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం త్వరలోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

By - Srikanth Kontham
Update: 2026-11-26 08:58 GMT

నితేష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కిన `రామాయణం` పార్ట్ 1 రికార్డుల వేట కొన‌సాగుతోంది. విడుదలైన మూడు వారాల్లోనే `పుష్ప 2: ది రూల్` లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసి ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. తాజాగా ఈ సినిమా క‌న్ను `బాహుబలి 2` రికార్డులపై పడింది.తొలి వారంలో వరుసగా ఏడు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన రామాయ‌ణం ఇప్పుడు కాస్త నెమ్మదించింది.

దేశీయంగా రోజువారీ నెట్ వసూళ్లు పది కోట్ల దిగువకు.. ప్రపంచవ్యాప్త గ్రాస్ ఇరవై కోట్ల లోపునకు చేరినా? ఇప్పటికే భారీ వసూళ్ల ఊపుతో పెద్ద రికార్డులను చెరిపేస్తోంది. మూడో వారంలోనే భారత్‌లో వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా `రామాయణం` నిలిచింది. బుధవారం దేశీయంగా 9.60 కోట్ల నెట్ రాబట్టడంతో 21 రోజుల్లో ఇండియా నెట్ వసూళ్లు 982 కోట్లకు ( 1174 కోట్ల గ్రాస్) చేరుకున్నాయి. ఇదే జోరు కొనసాగితే శనివారం నాటికి దేశీయంగా వెయ్యి కోట్ల నెట్ క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

తద్వారా `బాహుబలి 2`, `పుష్ప 2`, `ధురంధర్ 2` తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. విదేశీ మార్కెట్లలో ఆరంభంలో తడబడినా? మూడో వారంలో మళ్లీ పుంజుకుంది. అమెరికాతో పాటు థాయ్‌లాండ్.. వియత్నాం.. నేపాల్ వంటి దేశాల్లో అద్భుతమైన ఆదరణ దక్కడంతో 21 రోజుల్లో ఓవర్సీస్ వసూళ్లు 63 మిలియన్ డాలర్లను దాటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా `రామాయణం` మొత్తం వసూళ్లు 1755 కోట్లకు చేరాయి.

`పుష్ప 2` పేరిట ఉన్న 1742 కోట్ల రికార్డును బుధవారం అధిగమించిన `రామాయణం` `బాహుబలి 2` సాధించిన 1788 కోట్ల మార్కుకు 33 కోట్ల దూరంలోనే ఉంది. శుక్రవారం నాటికి ఆ రికార్డును కూడా దాటేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2000 కోట్ల మైలురాయి `దంగల్` ఆల్-టైమ్ రికార్డు 2070 కోట్లు అందుకోవాలంటే మాత్రం చైనా, జపాన్ దేశాల్లో భారీ విడుదలే కీలకం కానుందని తెలుస్తుంది.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్- డీఎన్‌ఈజీ- మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. రెండో భాగం 2028 దీపావళికి విడుదల కానుంది.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • yash 
  • boxoffice 

Similar News

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

2026-11-23 05:46 GMT

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS